How To Make Haldi Ice Cubes: పసుపులో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని ఎలాంటి అనారోగ్య సమస్యలకు వినియోగించిన మంచి ఫలితాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్స్ లభిస్తాయి. కాబట్టి ఈ పసుపును చర్మ సంరక్షణకు వినియోగించడం వల్ల చర్మం సహజంగా ఫెయిర్‌గా మారుతుంది. అంతేకాకుండా చర్మంపై ఓపెనైన రంధ్రాల సమస్యను కూడా సులభంగా దూరం చేస్తుంది. ముఖానికి పసుపు ఐస్ క్యూబ్స్‌ను వినియోగించడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పసుపు ఐస్ క్యూబ్స్ చేయడానికి కావలసిన పదార్థాలు:
➜ 1 టీస్పూన్ పసుపు
➜ 1 టీస్పూన్ కప్పు నీరు
➜ 1 టీస్పూన్ అలోవెరా జెల్
పసుపు ఐస్ క్యూబ్స్ తయారీ పద్ధతి:
✹ పసుపు ఐస్ క్యూబ్స్ చేయడానికి ముందుగా బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది.
✹ ఇందులోనే అలోవెరా జెల్ వేసి ఫైన్‌గా మిక్స్ చేసుకోవాలి.
✹ ఆ తర్వాత పసుపును వేసి బాగా మిక్స్ చేసుకోని సిద్ధంగా ఉంచుకోవాలి.
✹ ఈ మిశ్రమాన్ని క్యూబ్స్ మోల్డ్‌లో వేసుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి.
✹ ఇలా పెట్టిన 2 గంటల తర్వాత ఐస్ క్యూబ్స్‌లా మారుతాయి.
ముఖానికి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా?:
✹ పసుపు ఐస్ క్యూబ్స్ అప్లై చేయడానికి 25 నిమిషాల ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
✹ ఆ తర్వాత టోనర్‌తో ముఖాన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది.
✹ తర్వాత సిద్ధం చేసుకున్న ఐస్ క్యూబ్‌ను ముఖంపై 3నిమిషాల పాటు రుద్దాలి.
✹ తర్వాత సాధరణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
✹ ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి