వెనీస్ నగర విశేషాలు ఇవే..!

  

Last Updated : Nov 2, 2017, 08:55 PM IST
వెనీస్ నగర విశేషాలు ఇవే..!

ప్రపంచంలోని అందమైన నగరాల్లో వెనీస్ నగరం కూడా ఒకటి. ఇటలీలోని వెన్నిటో ప్రాంతానికి రాజధానైన ఈ నగరం ఎందరో కలల రాజ్యం. దీనిని సుందరాంగుల నగరమని కూడా అంటారు. రోమన్ కథలలో  ఈ నగరానికి ఉన్న ప్రాధాన్యమే వేరు. ఈ రోజు ఈ నగర విశేషాలేమిటో మనం కూడా తెలుసుకుందాం..!

  • వెనీస్ వెళితే తప్పకుండా గోండోలా వాటర్ వేస్ చూడాల్సిందే. ఈ వాటర్ వేస్‌ను మొత్తం చూడాలంటే పడవను అద్దెకు తీసుకోవాలి. నదీతీరంలో అందమైన వ్యాహాళి చేయాలనుకొనే జంటలకు అనువైన స్థలం ఇది
  • వెనీస్ హోటల్లో మంచి ఇటాలియన్ వంటకాలు దొరుకుతాయి. అందులో ఒంబ్రా, స్ప్రిట్జ్‌తో ఇచ్చే ప్యాకేజ్ ప్రత్యేకం. స్ప్రిట్జ్ అనేది ఒక ప్రత్యేకమైన వైట్ వైన్. వీటితో పాటు వివిధ ఫ్లేవర్ల పేస్ట్రీలు కూడా దొరుకుతాయి
  • అలాగే ఓకా అనే ప్రత్యేకమైన ఇటాలియన్  వంటకం ఇక్కడ దొరుకుతుంది. బాతు మాంసంతో తయారయ్యే ఈ వంటకం చాలా ఫేమస్ అక్కడ. అలాగే లగూన్ చేపల ఫ్రై కూడా దొరుకుతుంది. అలాగే గెలాటో అనే ప్రత్యేకమైన ఐస్ క్రీం కూడా వెనీస్‌లో మాత్రమే దొరకుతుంది

  • వెనీస్‌లో కాంపానైల్ అనే అతి పొడవైన భవనం ఉంది. పైకెక్కి క్రిందకు చూస్తే మీ కళ్లు గిర్రున తిరగడం గ్యారెంటీ. రోమన్ చక్రవర్తి ఫ్రెడరిక్ ఈ భవనాన్ని కట్టించాడట
  • అలాగే వెనీస్‌లో గ్రాండ్ కెనాల్ చాలా ప్రాధాన్యమున్న స్థలం. అయితే చూడాలంటే టికెట్ కొనాల్సిందే. ఈ కెనాల్‌లో షటిల్ జర్నీ చేసే అవకాశం కూడా ఉంది
  • అలాగే వెనీస్‌లో లెక్కలేనన్ని ఆర్ట్ గ్యాలరీలు ఉన్నాయి. చిత్రలేఖనం పట్ల ఆసక్తి ఉన్నవారు వాటిని దర్శించవచ్చు. ముఖ్యంగా పెగ్గీ గుగెన్ హీం గ్యాలరీ, పుంటా డెల్లా డొగానా గ్యాలరీ అందులో ప్రధానమైనవి
  • వెనీస్ నగరంలో వీధుల్లోనే ఆర్కెస్ట్రా గ్రూపులు ప్రదర్శనలు ఇస్తుంటాయి. లా వెనీస్, టెట్రో మలిబ్రాన్ అందులో ప్రధానమైన గ్రూపులు 
  • అలాగే క్యాంపెన్నో పెసానీ అనే ఒక పాతకాలం ప్యాలెస్ ఒకటి వెనీస్‌లో ఉంది. క్యాసినో రాయల్ వంటి జేమ్స్ బాండ్ సినిమాలు ఇక్కడే షూటింగ్ జరుపుకున్నాయి. 
  • అలాగే వెనీస్‌లో కొన్ని ప్రత్యేకమైన సీజన్లలో జరిగే కార్నివల్స్ చాలా బాగుంటాయి. ఒక్కో కార్నివల్ ఒక్కో థీమ్‌తో జరుగుతుంది. కొన్ని కార్నివల్స్‌లో జనాలందరూ మాస్క్‌లు ధరించి పాల్గొంటే.. కొన్నింటిలో జనాలు విచిత్ర వేషధారణలతో పాల్గొంటారు. 
  • అలాగే షేక్స్‌పియర్ ఫేవరెట్ హీరోయిన్ జూలియట్ హౌస్ కూడా వెనీస్‌లో ఉంది. కాసా డి గిలాటా అనే పేరుతో పిలిచే ఈ భవనం చాలా ఖరీదైంది. ఎంతోమంది ప్రేమికులు పెళ్లిళ్లు చేసుకోవడానికి దీనికి సందర్శిస్తారట. 

Trending News