Kandagadda Fry: కందగడ్డ ఫ్రై ప్రయోజనాలు తెలుస్తే అసలు వదిలిపెట్టరు..!

Kandagadda Fry Recipe: కందగడ్డ ఫ్రై అంటే కందగడ్డను ముక్కలతో తయారు చేసే ఒక వంటకం. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఇది ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు,ఫైబర్‌తో నిండి ఉంటుంది. దీనిని స్నాక్స్‌గా లేదా భోజనంతో కూడా తీసుకోవచ్చు.

Written by - Shashi Maheshwarapu | Last Updated : Sep 13, 2024, 06:13 PM IST
Kandagadda Fry: కందగడ్డ ఫ్రై ప్రయోజనాలు తెలుస్తే అసలు వదిలిపెట్టరు..!

Kandagadda Fry Recipe: కందగడ్డ ఫ్రై అంటే చాలా మందికి ఇష్టమైన వంటకం. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. దీని వివిధ రకాలుగా వండుతారు. ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అయితే కందగడ్డతో చేసే ఒక డిష్‌లో కందగడ్డ ఫ్రై ఎంతో ప్రత్యేకమైనది. కొన్ని చిట్కాలు తెలిస్తే ఇంకా రుచిగా తయారు చేయవచ్చు. 

కందగడ్డ తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది కీళ్ల సమస్యలతో బాధపడేవారు తినడం వల్ల ఎముకలు దృఢంగా తయారు అవుతాయి. ఇందులో ఉండే కాల్షియం, ఫాస్పరస్‌ అస్టియోపోరోసిస్‌ వంటి వ్యాధుల బారిన పడకుండా సహాయపడుతుంది. అలాగే జీర్ణవ్యవస్థతో బాధపడేవారు కూడా దీని తీసుకోవడం వల్ల ఇందులోని ఫైబర్‌ ఆహారాన్ని సులువుగా జీర్ణం చేస్తుంది. మలబద్ధకం, గ్యాస్‌ను తగ్గిస్తుంది. అంతేకాకుండా గుండె సంబంధిత సమస్యలు రాకుండా కూడా కందగడ్డ ఎంతో సహాయపడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అలాగే రక్తపోటును నియంత్రిస్తుంది. చర్మ సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది మంచి ఆహారం. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా, మెరిసిపోయేలా తయారు చేస్తుంది. కందగడ్డలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

కావలసిన పదార్థాలు:

కందగడ్డ - 1 (తొక్క తీసి ముక్కలు చేసి కడిగి పెట్టుకోవాలి)
మజ్జిగ
ఉప్పు
పసుపు
ఎండు మిరపకాయలు
అల్లం వెల్లుల్లి పేస్టు
కరివేపాకు
నూనె

తయారీ విధానం:

కందగడ్డ ముక్కలను మజ్జిగలో కొంతసేపు నానబెట్టడం వల్ల తినేటప్పుడు దురద రాకుండా ఉంటుంది. కందగడ్డ ముక్కలను కుక్కర్‌లో కొద్దిగా నీరు, ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. మూడు నాలుగు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక పాన్‌లో నూనె వేసి వేడి చేసి, ఉడికించిన కందగడ్డ ముక్కలను వేసి వేయించాలి. వేరొక పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి చేసి, ఎండు మిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసి వేగించి, వేయించిన కందగడ్డ ముక్కలపై పోయాలి. వేడి వేడిగా అన్నం, రోటీలతో సర్వ్ చేయండి.

గమనిక:

కందగడ్డ ఫ్రై చేసేటప్పుడు తక్కువ నూనె వాడటం మంచిది.
ఆరోగ్యంగా ఉండాలంటే కందగడ్డను వేపుడు చేయడంతో పాటు ఇతర రకాల వంటకాలలో కూడా చేర్చుకోవాలి.

Also Read: Orange Seeds: పొరపాటున కూడా ఈ గింజలు పడేయకండి.. దీని వల్ల లాభాలెన్నో..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News