Lip Care: నెయ్యి ఇలా పెదాలకు అప్లై చేస్తే నేచురల్‌గా పింక్ రంగులోకి మారిపోతాయి..

Ghee In Lip care:  నెయ్యిని లిప్‌ కేర్ లో కూడా ఉపయోగించవచ్చు. ఇది అద్భుతంగా పనిచేస్తుంది పొడి వారి పగిలిపోయి పెదాల నుంచి ఒక్కోసారి రక్తం కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనికి ప్రభావవంతమైన రెమిడీగా నెయ్యి పనిచేస్తుంది.

Written by - Renuka Godugu | Last Updated : Aug 23, 2024, 07:06 AM IST
Lip Care: నెయ్యి ఇలా పెదాలకు అప్లై చేస్తే నేచురల్‌గా పింక్ రంగులోకి మారిపోతాయి..

Ghee In Lip care: నెయ్యిని వివిధ వంటల్లో ఉపయోగిస్తారు. అంతే కాదు ఆయుర్వేద పరంగా ఎంతో ప్రయోజనాలు కలిగి ఉంది. నెయ్యి లోతైన మాయిశ్చర్ గుణాలు కలిగి ఉంటుంది. ఇందులో మన శరీరానికి కావలసిన ఫ్యాటీ ఆసిడ్స్ విటమిన్స్ ఉంటాయి. ఇందులో యాంటీ యాక్సిడెంట్ లాంటిది చర్మానికి పునరుజ్జీవనం అందిస్తుంది. నెయ్యి పొడి బారిన చర్మానికి ఒక షీల్డ్‌లా పనిచేస్తుంది సన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.

నెయ్యిని లిప్‌ కేర్ లో కూడా ఉపయోగించవచ్చు. ఇది అద్భుతంగా పనిచేస్తుంది పొడి వారి పగిలిపోయి పెదాల నుంచి ఒక్కోసారి రక్తం కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనికి ప్రభావవంతమైన రెమిడీగా నెయ్యి పనిచేస్తుంది. ఎందుకంటే నెయ్యిలో మాయిశ్చర్ గుణాలు ఉంటాయి, మృదువుగా పెదాలను మార్చే గుణం ఉంటుంది. ఇది మాయిశ్చర్ లాక్ చేసి సున్నితమైన స్కిన్ ని రిపేర్ చేస్తుంది. దీంతో మీ లిప్స్ నాచురల్ గా పింక్ రంగులోకి మారి మృదువుగా మారడం చూస్తారు.

లిప్ ఆయిల్..
నెయ్యితో లిప్‌ ఆయిల్‌ తయారు చేసుకోవడం వల్ల ఇది నాచురల్ గా పనిచేస్తుంది. ఇందులో ఎక్స్‌ఫోలియేటింగ్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పెదాలకు చక్కెర, తేనె, నెయ్యిలో వేసి కలిపి చేతి వేళ్ల సాయంతో పెదాలకు మృదువుగా మసాజ్ చేయాలి. ఓ రెండు నిమిషాల తర్వాత అలాగే వదిలేయండి. ప్రతిరోజూ నైట్ ఇలా చేయటం వల్ల మీ పెదాలకు కావాల్సిన మాయిశ్చర్ అందుతుంది.

ఎక్స్‌ఫోలియేటర్..
నెయ్యిలో నేచురల్ ఎక్స్‌ఫోలియేటర్ గుణాలు ఉంటాయి. బ్రౌన్ షుగర్ తో నెయ్యి కలిపి లిప్స్ కి రబ్‌ చేయటం వల్ల మీ పెదాలు నేచురల్ గా పింక్ రంగులోకి మారి కాంతివంతంగా కనిపిస్తాయి.

 మీ ఇంట్లో నివసించే ఈ చిన్న జీవి పాము కంటే ప్రమాదకరం! ఏటా 10 లక్షల మందిని చంపేస్తుంది!!

లిప్ బామ్
నెయ్యితో సులభంగా లిప్ బామ్ తయారు చేసుకోవచ్చు. నెయ్యి కొబ్బరి నూనెలో సమపాళ్లలో కలుపుకొని దీన్ని పగిలిన పెదాలకు అప్లై చేయడం వల్ల ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

టింటెడ్ లిప్ బామ్‌..
నెయ్యి పెదాలను నేచురల్ గా పింకు రంగులోకి మారుస్తుంది. బీట్రూట్ జ్యూస్ లో నెయ్యి కలిపి తయారు చేసుకోవచ్చు బీట్రూట్ జ్యూస్ లో నాచురల్ గా పింక్ గ్లో ఇచ్చే గుణాలు ఉంటాయి ఇది మృదువుగా లోతుగా పెదాలను అందంగా మార్చి హైడ్రేషన్ అందిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News