New Year 2022: కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఇంకో నాలుగు రోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. 2021కి గుడ్ బై చెప్పి (Good bye to 2021).. 2022కు వెల్కం చెప్పేందుకు అప్పుడే సన్నాహాలు (Happy new Year) మొదలయ్యాయి
చాలా మంది ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ వేడుకలు (New Year Party in India) ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసుకోవాలని చూస్తుంటారు. పైగా ఈ సారి వీకెండ్ (Weekend Parties) కూడా రావడంతో రెండు, మూడు రోజులు ఏంజాయ్ చేయాలని ప్లాన్స్ వేసుకుంటున్నారు.
ఈ సారి పార్టీ ఎక్కడ జరుపుకోవాలనే విషయంపై చాలా మంది అయోమయంలో ఉంటారు. మీకూ అలాంటి సందేహాలే ఉంటే.. మీకో గుడ్ న్యూస్. సారి న్యూ ఇయర్ పార్టీ చేసుకునేందుకు 5 బెస్ట్ ప్లేసెస్ వివరాలు ఇప్పుడు (Best Place for New Year Party) తెలుసుకుందాం.
1 సన్‌బర్న్(గోవా)
మన దేశంలో న్యూ ఇంయర్ పార్టీ అంటే.. ముందుగా గుర్తొచ్చేది గోవానే. సముద్రపు తీరంలో కొత్త సంవత్సరం సెలబ్రెట్ చేసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్ అని (New Year Party in Goa) చెప్పొచ్చు. ఈ పార్టీలో మ్యూజిక్ బ్యాండ్, ఫేమస్ ఆర్టిస్ట్‌లతో లైవ్ షో ఉంటుంది. కావాల్సినన్ని ఫుడ్ వెరైటీస్.. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడి పార్టీ ప్రత్యేకత.
2.అరోమా గార్డెన్స్(పుదుచ్చెరి)
ప్రశాంతమైన వాతావరణంలో పార్టీ జరుపుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్. సాధారణ పార్టీలతో పోలిస్తే.. ఇది భిన్నంగా ఉంటుంది. పచ్చని తోటల మధ్య హాయిగా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ పార్టీలో పాల్గొనొచ్చు. లైట్ మ్యూజిట్, డ్యాన్స్‌లు వంటివి, మంచి ఫుడ్ ఇక్కడి ప్రత్యేకత.
3.ది 5-స్టార్ (బెంగళూరు)
ఇండియా ఐటీ హబ్‌గా పిలిచే బెంగళూరులో.. న్యూ ఇయర్ పార్టీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. లీలా కెంపిన్స్కిలో రిచ్‌గా ఈ పార్టీ జరుగుతుంది. దిగ్గజ ఆర్టిస్టులతో మ్యూజిక్, ప్రత్యేక డ్యాన్స్ షోలు ఉంటాయి. అన్నిటికి మించి అద్భుతమైన వాతావరణలో.. రుచికరమైన భోజనం (కావాల్సినన్ని వెరైటీలు), డ్రింగ్స్ ఈ పార్టీకి వచ్చే వారికోసం అందుబాటులో ఉంటాయి.
4.పడవలో పార్టీ (అండమాన్, నికోబార్ ఐస్లాండ్స్)
సాధారణ పార్టీల నుంచి డిఫరెట్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వారు పడవలో కూడా న్యూ ఇయర్ పార్టీ చేసుకోవచ్చు. అండమాన్, నికోబార్ ఐస్లాండ్స్లో ఈ అవకాశముంది. దీనితో పాటు.. పోర్ట్ బ్లెయర్, సిల్వర్ సాండ్ బీచ్ రిసార్ట్, సీ ప్రిన్నసెస్ బీచ్ రిసార్ట్, సింక్లెర్స్ బే వ్యూ, పీర్లెస్ రిసార్ట్ వంటి ప్రాంతాలు ఇక్కడ పార్టీకి ప్రసిద్ధి.
5.నహర్‌గఢ్ ఫోర్ట్ పార్టీ (జైపూర్)
ల్యాండ్ ఆఫ్ కింగ్‌గా పిలిచే జైపూర్‌లో కూడా కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడున్న నహర్‌గఢ్ కోటలో అంతర్జాతీయ స్థాయి డీజేలతో ప్రత్యేక షోలు నిర్వహిస్తారు. పాప్ సంగీతాన్ని ఆస్వాదిస్తూ.. ఇక్కడ పార్టీ చేసుకోవచ్చు. ఇంక రాజస్థాన్ ప్రత్యేక వంటకాలతో ఇతర డ్రింక్స్‌తో ఇక్క పార్టీ జరుగుతుంది.
Also read: Tips to lose Weight: బరువు తగ్గేందుకు ఏడురోజుల్లో ఏడు టిప్స్, చేసి చూడండి
Also read: Malaika Arora Yoga Tips: బెల్లీ ఫాట్ తగ్గించేందుకు మలైకా అరోరా చెప్పిన టిప్స్ మీరూ పాటించండి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook