Red Banana Benefits In Telugu: రోజు ఉదయాన్నే బనానా తినడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి తక్షణ శక్తిని అందిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ప్రతి రోజు రెడ్ బానానాలు తినడం వల్ల శరీరాని ఊహించని స్థాయిలో పోటాషియం లభిస్తుంది. దీంతో పాటు ఫైబర్ కూడా ఎక్కువ మోతాదులో అందుతుంది. కాబట్టి రోజు తినడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రెడ్ బనానాతో చేసిన స్మూతీ తాగడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు. ముఖ్యంగా వ్యాయామాలు చేసేవారు ప్రతి రోజు దీనిని తాగడం వల్ల మాజిల్స్ కూడా భారీగా పెరుగుతాయి. ఇవే కాకుండా ఎన్నో రకాల లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
రెడ్ బనానా స్మూతీ తాగడం వల్ల కలిగే లాభాలు:
గుండెకు మంచిది:
ప్రతి రోజు రెడ్ బనానా రసం తాగడం వల్ల శరీరానికి తగిన మోతాదులో పొటాషియం లభిస్తుంది. దీని కారణంగా రక్తపోటు కూడా నియంత్రించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది.
శక్తిని పెంచుతుంది:
రెడ్ బనానాలో మంచి కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి తక్షణ శక్తిని అందించడమే కాకుండా శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలను చేకూర్చుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యాయామాలు చేసేవారు ప్రతి రోజు ఈ స్మూతీ తాగడం వల్ల శరీర స్థామినా కూడా విపరీతంగా పెరుగుతుంది. దీని వల్ల బాడీ దృఢంగా తయారవుతుంది.
చర్మ ఆరోగ్యానికి మంచిది:
రెడ్ బనానాలో విటమిన్ ఎతో పాటు వివిధ రకాల పోషకాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. అల్పాహారం చేసిన గంట తర్వాత ఈ రసాన్ని తాగడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. దీంతో పాటు చర్మంపై ఉన్న వివిధ రకాల మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి.
Also read: Allu Arjun: అల్లు అర్జున్‌కు అరుదైన ఖ్యాతి, హాలీవుడ్ మేగజైన్ కవర్ పేజిపై బన్నీ ఫోటో
జీర్ణక్రియ ఆరోగ్యాని..:
రెడ్ బనానాలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ బనానాలతో తయారు చేసిన స్మూతీ రోజు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకం, పొట్ట నొప్పి, పొట్టకు సంబంధించి దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరవముతాయి. అలాగే జీర్ఱవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.
రోగనిరోధక శక్తి:
రెడ్ బనానాలో విటమిన్ సితో పాటు శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ స్మూతీ తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థను బలోపేతమవుతుంది. దీని కారణంగా సీజనల్ వ్యాధులు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also read: Allu Arjun: అల్లు అర్జున్‌కు అరుదైన ఖ్యాతి, హాలీవుడ్ మేగజైన్ కవర్ పేజిపై బన్నీ ఫోటో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి