Rose Water For Glowing Skin: రోజ్ వాటర్‌ను కొన్ని రిసిపీలు ముఖ్యంగా బ్యూటీ రొటీన్లో వాడతారు. దీంతో అనేక ప్రయోజనాలు. రోజ్ వాటర్‌ను గులాబీ రేకులను ఉపయోగించి తయారు చేస్తారు. ఇది సహజసిద్ధమైన గ్లో అందిస్తుంది. చాలా మంది అందంగా కనిపిండానికి వేలల్లో ఖర్చు పెట్టి మరీ పార్లర్‌కు వెళతారు. కొన్ని చిన్ని ఇంటి చిట్కాలు ఉపయోగించి కూడా మన ముఖంపై గ్లో పొందవచ్చు.
రోజ్ వాటర్‌లో నయం చేసే గుణాలు ఉంటాయి. ముఖానికి రెట్టింపు ఛాయను కూడా ఇస్తుంది. రోజ్ వాటర్ నీటిని రాత్రి పడుకునేటప్పుడు ముఖానికి అప్లై చేస్తే ఉదయం మీరు నిద్ర లేచేసరికి గ్లోయింగ్ స్కిన్ పొందుతారు. ఇది రాత్రికి రాత్రే జరిగే మిరాకిల్. దీంతో ఎలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. రోజ్ వాటర్‌ను హెయిర్ కేర్ రొటీన్లో కూడా వినియోగిస్తారు. ఇది మంచి సువాసన అందించడమే కాదు జుట్టును మెరిపిస్తుంది.
రోజ్ వాటర్‌ను టోనర్‌లా వాడొచ్చు. ముఖానికి మంచి గ్లో అందిస్తుంది. మేకప్ వేసుకున్న తర్వాత ముఖానికి సెట్టింగ్ స్ప్రే మాదిరి కూడా ఉపయోగించండి. బయటకు వెళ్లేటప్పుడు జుట్టుపై స్ప్రే చేసుకోవచ్చు. రోజ్ వాటర్‌తో కొన్ని రకాల ఫేస్ ప్యాకులు కూడా తయారు చేసుకోవచ్చు. రానున్నది ఎండాకాలం ముఖం ట్యాన్ అవ్వకుండా ముఖంపై రోజ్ వాటర్‌తో టోనర్‌లా కాటన్ ప్యాడ్ ఉపయోగించి క్లీన్ చేయాలి. సూర్యుని హానికర కిరణాల నుంచి మన చర్మాన్ని కాపాడుతుంది. సన్ ట్యాన్ తగ్గించడంలో సహాయపడుతుంది రోజ్ వాటర్.
రోజ్ వాటర్‌తో ఫేస్ ప్యాక్..
రోజ్ వాటర్, శనగపిండి కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. దీంతో ముఖం పై ఉండే మంగు మచ్చలు తొలగిపోతాయి. ముఖంపై సహజసిద్ధమైన గ్లో వస్తుంది. కొంతమందికి పాలు ముఖానికి పడవు. అలాంటివారు ఫేస్ ప్యాకులు తయారు చేసినప్పుడు రోజ్ వాటర్ ఉపయోగించండి. తద్వారా ముఖంపై ఉండే అదనపు నూనె కూడా ఇది గ్రహిస్తుంది. మచ్చలేని అందం మీ సొంతం అవుతుంది.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
శనగపిండి బదులుగా మీరు బియ్యం పిండిని కూడా వాడొచ్చు. కొంతమందికి శనగపిండి పడదు బియ్యం పిండి, పసుపు, రోజ్ వాటర్ ఉపయోగించి ఫేస్ ప్యాక్ తయారు చేయండి. దీంతో కూడా మీ స్కిన్ మెరిసిపోతుంది. ముఖంపై ఉండే మచ్చలు, గీతలు సైతం తొలగిపోతాయి. అంతేకాదు రోజ్ వాటర్ తో ముఖానికి స్క్రబ్ కూడా తయారు చేసుకోవచ్చు. కాపీ, షుగర్, రోజ్ వాటర్ ఉపయోగించి స్క్రబ్ చేయాలి. ఇది చర్మానికి ఈవెన్ స్కిన్ టోన్ అందిస్తుంది. అంతేకాదు ఇది మీ ముఖాన్ని మృదువుగా మారుస్తుంది కూడా . రోజ్ వాటర్ డ్రై స్కిన్ ఉన్నవారు అతిగా వాడకూడదు. దీంతో మీ చర్మం మరింత పొడిబారుతుంది. పొట్టు మాదిరి చర్మం రాలుతుంది.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.