Sprouts Salad Recipe In Telugu: శరీరం ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండాలంటే తప్పకుండా ప్రతిరోజు తీసుకునే ఆహారం పోషకాలు కలిగినదై ఉండాలి. అయితే చాలామంది అయితే చాలామంది తమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం పోషకాలు కలిగిన ఆహారం మాత్రమే తినేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా చాలామంది ఉదయం అల్పాహారంలో భాగంగా కేవలం పచ్చి కూరగాయలతో తయారు చేసిన సలాడ్స్ మాత్రమే తీసుకుంటున్నారు. నిజానికి ప్రతిరోజు సలాడ్స్ తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలామంది ఆరోగ్యంగా ఉండేందుకు ఉదయం ఎక్కువగా ఫ్రూట్స్‌తో తయారు చేసిన సలాడ్స్ తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు.
శరీరం ఆరోగ్యంగా దృఢంగా ఉండడానికి ఈ పండ్లతో తయారుచేసిన సలాడ్స్‌కి బదులుగా మొలకెత్తిన గింజలతో తయారు చేసినవి తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన గింజల్లో అధిక మోతాదులో పోషకాలు, ఇతర మూలకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా శక్తివంతంగా తయారవుతుంది. అయితే ప్రస్తుతం చాలామంది మూలకెత్తిన గింజలను నీటిలో ఉడకబెట్టి తీసుకుంటున్నారు. మరికొందరైతే అతిగా నీటిలో ఉడికించి తీసుకుంటున్నారు. నిజానికి ఎక్కువగా ఉడికిన మొలకలను తీసుకోవడం వల్ల శరీరానికి తగిన పోషకాలు లభించకపోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ మొలకల రెసిపీ పద్ధతిని అనుసరించండి.
కావాల్సిన పదార్థాలు:
1 కప్పు మొలకలు (కంది, పెసర, శనగ, చిక్కుడు, మిశ్రమం)
1/2 కప్పు తరిగిన టమాటా
1/2 కప్పు తరిగిన ఉల్లిపాయ
1/4 కప్పు తరిగిన క్యారెట్
1/4 కప్పు తరిగిన దోసకాయ
1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
1/2 టీస్పూన్ ఉప్పు
1/4 టీస్పూన్ నల్ల మిరియాలు
1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె
1/4 టీస్పూన్ జీలకర్ర
1/4 టీస్పూన్ ఆవాలు
1/4 టీస్పూన్ కరివేపాకు
1/4 టీస్పూన్ ఎండు మిరపకాయ
తయారీ విధానం:
ముందుగా తీసుకున్న మొలకలను ఒక బౌల్లో వేసుకొని బాగా నీటితో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. శుభ్రం చేసుకున్న తర్వాత పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత ఒక గిన్నెలో చిన్నగా కట్ చేసుకున్న టమాటా, ఉల్లిపాయ, క్యారెట్, దోసకాయ వేసి కలపాలి. వీటిని కూడా ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచుకోవాలి.
ఒక చిన్న గిన్నెలో నిమ్మరసం, ఉప్పు, మిరియాలు కలిపి ఒక డ్రెస్సింగ్ తయారు చేసుకోండి.
ఒక పాన్ లో ఆలివ్ నూనె వేడి చేసి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండు మిరపకాయ వేసి వేయించాలి.
ఇలా పది నిమిషాల పాటు బాగా వేయించిన తర్వాత పక్కన పెట్టుకున్న మొలకలను అందులో వేసి బాగా టాస్ చేసుకోవాలి.
ఆ తర్వాత పైన పేర్కొన్న వేసుకొని ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాల్సి ఉంటుంది.
ఇలా వేయించుకొని నిమ్మరసం కలుపుకొని సర్వ్ చేసుకుని తింటే రుచితో పాటు ఆరోగ్యం పొందడం ఖాయం.
చిట్కాలు:
మరింత ఆరోగ్యం కోసం మీరు ఇష్టపడే ఇతర కూరగాయలను కూడా ఈ సలాడ్‌లో చేర్చుకోవచ్చు.
డ్రెస్సింగ్ లో మీరు ఇష్టపడే మసాలాలు కూడా కలపవచ్చు.
ఈ సలాడ్ ను మరింత రుచికరంగా చేయడానికి మీరు పెరుగు లేదా పెరుగు చట్నీ కూడా కలపవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి