Tips To Get Glowing Skin Like Madhuri Dixit: ప్రతి ఒక్కరూ ఉన్నదానికంటే ఎక్కువ అందాన్ని కోరుకుంటారు. అంతేకాకుండా అందంగా కనిపించేందుకు వివిధ రకాల ప్రొడక్ట్స్ ని వినియోగిస్తారు. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నటి మాధురి దీక్షిత్ తన అందానికి సంబంధించిన రహస్యాలను వెల్లడించింది. ఆమె అభిమానులకు ఆరోగ్యంగా ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో చిట్కాలను పంచుకుంది. ఆమె నిత్యం వినియోగించే చర్మానికి సంబంధించిన ఫేస్ ప్యాక్ ల గురించి కూడా తెలిపింది మాధురి దీక్షిత్ తన అందాన్ని రక్షించుకునేందుకు పెంపొందించుకునేందుకు రోజు రెండు రకాల ఫేస్ ప్యాక్ లను ఉపయోగించేదని అభిమానులతో పంచుకుంది.
ఆమె ఓట్స్‌తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ వాడేది:
నటి మాధురి తన చర్మాన్ని సురిక్షితంగా, అందంగా కనిపించేందుకు నిత్యం ఓట్స్‌తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ను ఉపయోగించేది. ఈ ఫేస్ ప్యాక్ చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం ఎప్పుడూ బిగుతుగా ఉంటుందని ముడతలు కూడా రావని అమె తెలిపింది. అయితే ఈ ఫేస్ ఫ్యాక్ తయారు చేసుకోవడానికి.. ముందుగా ఒక చెంచా ఓట్స్ పౌడర్ తీసుకోండి. అందులో కొంచెం తేనెను వేసి బాగా మిక్స్ చేయాలి. అంతేకాకుండా అందులో కొద్దిగా రోజ్ వాటర్ వేసి..ఇదే క్రమంలో పాలను కూడా వేసి ఫైన్‌గా మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన ఓట్స్ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా మాధురి తన చర్మాన్ని అందంగా..కాంతి వంతంగా చేసుకోవడానికి క్రమం తప్పకుండా వినియోగించేదట..
హనీ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి:
చాలామంది హీరోయిన్స్ అందంగా కనిపించేందుకు ముఖానికి మార్కెట్లో లభించే వివిధ రకాల ప్రొడక్షన్ వినియోగిస్తారు. అయితే మాధురి దీక్షిత్ హనీ ఫేస్ ప్యాక్ ను వినియోగించేదట. ఈ ఫేస్ ప్యాక్ ను క్రమం తప్పకుండా ముఖానికి అప్లై చేస్తే ముఖం కాంతివంతంగా తయారవ్వడమే కాకుండా చర్మం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంటుందని ఆమె తెలిపింది. అయితే ఈ ఫేస్ ప్యాక్ ను తయారు చేయడానికి ముందుగా.. ఒక చెంచా పాలను తీసుకొని.. అందులో అలోవెరా జెల్ వేసి ఒక చెంచాడు తేనెను వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ముఖానికి అప్లై చేసి శుభ్రంగా నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా చేస్తే అన్ని రకాల చర్మ సమస్యలు దూరమవుతాయని మాధురి దీక్షిత్ అన్నారు.
Also Read: Mistakes in God Father: చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ఈ తప్పులని మీరు గమనించారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook