Ways To Reduce Overweight: మారిన జీవనశైలి కారణంగా మనం తీవ్రమైన వ్యాధుల బారిన పడతున్నాము. వయసుతో సంబంధం లేకుండా వివిధ అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి. దీనికి ముఖ్యకరణం మారిన ఆహారపు అలవాట్లు అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మారిన అలవాట్ల కారణంగా ప్రతిఒకరు అధిక బరువు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఈ అధిక బరువు చిన్న వయసు ఉన్నవారిలో ఎక్కువగా కనిపించడం బాధకరమైన విషయం అని చెప్పవచ్చు. మనం తీసుకొనే ఆహారం వల్ల మన ఆరోగ్యం అధారపడి ఉంటుంది. పోషకరమైన ఆహార తీసుకోవడం వల్ల శరీరం ఎల్లప్పుడు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది.
అయితే అధిక బరువు కారణంగా చాలా మంది వారికి నచ్చిన వస్తువులు, ఆహారం తీసుకోలేకపోతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడడానికి చాలా వరకు మార్కెట్‌లో లభించే ప్రొడెక్ట్స్, మందులు, ఎక్కువ ఖర్చుతో కూడిన చికత్సలు వంటివి చేస్తుంటారు. దీని వల్ల సమస్య మరింతగా పెరుగుతుంది..కానీ ఎలాంటి లాభం కనిపించదని చెప్పవచ్చు. అయితే ఇక్కడ చెప్పే కొన్ని టిప్స్‌ను పాటించడం వల్ల సమస్య నుంచి కొంత ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీని కోసం మీరు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
అధిక బరువుకు చెక్ పెట్టండి ఇలా:
ఆహారం:
ప్రొటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్:
ఉదయం పూట గుడ్లు, పప్పు దినుసులు వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు పొట్టు నిండినట్లు అనిపించి, రోజంతా తక్కువగా తినకుండా ఉంటారు. దీని వల్ల బరవుకూడా పెరగరు.
ఫైబర్ రిచ్ ఫుడ్స్:
పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచడానికి సహాయపడతాయి.
కార్బోహైడ్రేట్లు తగ్గించండి:
బియ్యం, మైదా వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తగ్గించి,గోధుమ పిండి వంటి పిండి పదార్థాలను ఎంచుకోండి.
సరిపడా నీళ్లు తాగండి:
శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు తాగండి. భోజనానికి ముందు నీరు తాగడం వల్ల తక్కువ తినడానికి సహాయపడుతుంది.
వ్యాయామం:
వారానికి కనీసం 3-4 సార్లు వ్యాయామం చేయడం లాభదాయకం. నడక, పరుగు, ఈత, సైక్లింగ్ వంటి కార్డియో వ్యాయామాలు బాగుంటాయి.
ఇతర చిట్కాలు:
పెద్ద ప్లేట్ల కంటే చిన్న ప్లేట్లలో తినండి:
చిన్న ప్లేట్లు తక్కువ ఆహారాన్ని వడ్డించడానికి సహాయపడతాయి.
మంచి నిద్ర అవసరం:
నిద్ర లేమి వల్ల ఆహార కోరికలు పెరుగుతాయి. రోజుకు 7-8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter