Ghee for many benefits: నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే నెయ్యిని ఇతర పదార్థాలో కలిపి తీసుకోవడం చాలా మంచిదని అంటున్నారు ఆహార నిపుణులు. మనం ఇప్పుడు నెయ్యిని ఎలాంటి పదార్థాల్లో వాడుకోవచ్చే ఆంశంపై తెలుసుకుందాం.
నెయ్యితో కలిపి తీసుకోదగిన పదార్థాలు ఏంటి..?
నెయ్యిలో పసుపును కలిపి తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. శరీరంలో మంట తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వాతావరణ మార్పుల కారణంగా వ్యాధుల సమస్యలు రాకుండా కపాడుతుంది. అంతేకాకుండా సులభంగా బరువు తగ్గవచ్చు. శరీరంలో వచ్చే కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.
అలాగే నెయ్యిలో మెంతులు కలిపి తీసుకోవడం వల్ల కూడా ఎంతో మేలు కలుగుతుంది. నెయ్యిలో మెంతులు కలిపి తీసుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఈ విధంగా నెయ్యిని ఇతర పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also read: Acidity Remedies: ఎంతటి కడుపులో మంట అయినా సరే.. నిమిషాల్లో మాయం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి