Tomato Juice Benefits: అజీర్ణం సమస్యతో బాధపడుతున్నవారు.. ఈ జ్యూస్‌ తాగుతే సమస్యకు చెక్‌!

Benefits Of Drinking Tomato Juice: మనం వంటల్లో టొమాటోను ఎక్కువగా ఉపయోగిస్తాము. టొమాటోలో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ మైక్రోబియల్ లక్షణాల అధికంగా లభిస్తాయి. దీనిని కూరల్లోనే కాకుండా జ్యూస్‌ కూడా తయారు చేసుకొని తాగవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2024, 07:15 PM IST
Tomato Juice Benefits: అజీర్ణం సమస్యతో బాధపడుతున్నవారు.. ఈ జ్యూస్‌ తాగుతే సమస్యకు చెక్‌!

Benefits Of Drinking Tomato Juice: టొమాటో జ్యూస్‌ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పరిశోధనల ద్వారా తేలింది. దీని వల్ల జీర్ణ, మూత్ర నాళానికి హాని కలిగించే హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడగలదని ఈ అధ్యయనంలో తేలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

అంతేకాకుండా టొమాటో జ్యూస్‌ తాగడం వల్ల టైఫాయిడ్ జ్వరానికి కారణమయ్యే బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది. చిన్నపిల్లలు, పెద్దలలో పేగు క్రిములను తొలగించడంలో టొమాటో జ్యూస్‌ ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో టొమాటో జ్యూస్ తాగడం వల్ల మీ పొట్ట శుభ్రంగా అవుతుంది.

టొమాటో జ్యూస్‌ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సంరక్షణలో కూడా ఎంతో సహాయపడుతుంది. 

జిడ్డు చర్మంతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం టొమాటో జ్యూస్‌ తాగడం వల్ల సమస్య నుంచి బయట పడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

❅ అలాగే మొటిమల సమస్యలతో బాధపడేవారు టొమాటో జ్యూస్‌ తాగడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. 

❅ టొమాటోలో ఉండే విటమిన్లు, ఐరన్ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

❅ అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ శరీరంలో చేరకుండా కాపాడుతుంది. ఇందులోని విటమిన్‌ సి, ఎ, బీటా పోషకాలు శరీరాని బలంగా తయారు చేస్తాయి. 

❅ అలాగే రక్త నాళాలను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతాయి.

❅ కడుపు మంట, ఒత్తిడి వంటి సమస్యలను అదుపు చేయడంలో ఈ జ్యూస్‌ ఎంతో మేలు చేస్తుంది.

❅ టమోటాలు తినేవారి ఎలాంటి కంటి సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

❅  టొమాటోలోని పోషకాలు కంటి సమస్యలను దూరం చేయడంలో ఎంతో సహాయపడుతాయి.

❅  టొమాటో జ్యూస్‌ తాగడం వల్ల నోటి క్యాన్సర్ సమస్యలను రాకుండా కాపాడుతుంది. 

❅  అయితే పచ్చి టొమాటోలను కాకుండా పండిన టొమాటోలను తినడం వల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

❅  టొమాటో జ్యూస్‌ని ప్రతి రోజు తాగడం వల్ల  జీర్ణవ్యవస్థ మెరుగుగా పనిచేస్తుంది. 

ఈ జ్యూస్‌లో అధిక శాతం పీచు పదార్థం ఉంటుంది. దీని వల్ల  మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలకు చెక్‌ పెట్టవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Also read: Budget Facts: దేశంలో బడ్జెట్ గురించి ఆసక్తికరమైన అంశాలు, తొలి బడ్జెట్ ఆదాయం అంచనా ఎంతో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News