Nenu Keerthana: ‘నేను-కీర్తన’ మూవీలోని 'సీతా కోకై ఎగిరింది మనసే’ పాటకు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ ..! త్వరలో విడుదల..

Nenu Keerthana: చిమటా రమేష్ బాబు హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నేను కీర్తన’. సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని  "సీతాకోకై ఎగిరింది మనసే" లిరికల్ సాంగ్ వీడియోకు  మంచి రెస్పాన్స్ వస్తోంది. అసాధారణ స్పందన లభిస్తోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 24, 2024, 09:19 PM IST
Nenu Keerthana: ‘నేను-కీర్తన’ మూవీలోని 'సీతా కోకై ఎగిరింది మనసే’ పాటకు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ ..! త్వరలో విడుదల..

Nenu Keerthana: చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు ("సి.హెచ్.ఆర్")ను నిర్మాతగా, దర్శకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘నేను కీర్తన’. ఈ సినిమాలో చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) హీరోగా నటిస్తున్నాడు. రిషిత, మేఘన కథానాయికలుగా నటిస్తున్నారు. చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన "నేను-కీర్తన" చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.  
తాజాగా ఈ సినిమాలోని ఈ లిరికల్ వీడియో సాంగ్ ను  సంచలన దర్శకుడు సాయి రాజేష్ బేబి ఫేమ్ విడుదల చేసారు. ఈ పాటను కులుమనాలిలో ఏరికోరి ఎంపిక చేసిన పలు అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు.

"బేబి' దర్శకుడు సాయి రాజేష్ విడుదల చేసిన సీతా కోకై" లిరికల్ వీడియోకు సోషల్ మీడియాలో అనూహ్యమైన స్పందన దక్కుతోంది. దీంతో ఈ సినిమా సక్సెస్ పై మేము పెట్టుకున్న నమ్మకాన్ని రెట్టింపు చేసిందంటూ ఈ పాటను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ చిత్ర దర్శకుడు కమ్ కథానాయకుడు చిమటా రమేష్ బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘నేను - కీర్తన’ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. మల్టీ జోనర్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. విడుదలకు సిద్ధంగా ఉన్న ‘నేను కీర్తన’ చిత్రానికి బిజినెస్ పరంగానూ మంచి క్రేజ్ ఏర్పడింది. కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతోపాటు... ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనున్నాయని చిత్ర యూనిట్ పేర్కొంది.

సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్ ఇతర లీడ్ రూల్స్ ప్లే చేసారు. ఈ చిత్రానికి పాటలు: సి.హెచ్.ఆర్ - అంచుల నాగేశ్వరరావు - శ్రీరాములు, సంగీతం: ఎం.ఎల్.రాజా, ఛాయాగ్రహణం: కె. రమణ, కూర్పు: వినయ్ రెడ్డి బండారపు,  పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, డి.ఐ: భాను ప్రకాష్, వి.ఎఫ్.ఎక్స్: నవీన్, ఎస్.ఎఫ్.ఎక్స్: ఎ. నవీన్ రెడ్డి, పోరాటాలు: నూనె దేవరాజ్, నృత్యాలు: అమిత్ కుమార్ - సి.హెచ్.ఆర్, సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ), నిర్మాత: చిమటా లక్ష్మికుమారి, రచన - దర్శకత్వం: చిమటా రమేష్ బాబు.

Also read: IRCTC Alert: ఫ్రెండ్స్ కోసం రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా, మూడేళ్లు జైలు శిక్ష తప్పదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News