నటీనటులు: వంశీ రామ్ పెండ్యాల, స్వాతి భీమిరెడ్డి, హేమంత్ ఉద్ధవ్, అజయ్ నిడదవోలు, సుమేష్ మాధవన్ తదితరులు
ఎడిటింగ్: శివ శర్వానీ
సినిమాటోగ్రఫీ: రేవంత్ సాగర్,
సంగీతం: జాన్ కే జోసెఫ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పర్వతనేని రాంబాబు
నిర్మాత: మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి
దర్శకత్వం: హరినాథ్ పులి
ప్రెజెంట్ చిత్ర పరిశ్రమలో లో బడ్జెట్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అంతేకాదు కంటెంట్ బాగుంటే.. ఆదరించడానికి మేము రెడీ అంటున్నారు ప్రేక్షకులు. ఈ కోవలో అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన చిత్రం ‘రేవు’. హరినాథ్ పులి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, పర్వతనేని రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా ఈ సినిమా నిర్మించడం విశేషం. మరి ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
సముద్ర తీర గ్రామమైన పారలేవు అనే గ్రామంలో అంకాలు (వంశీరామ్ పెండ్యాల), గంగయ్య (అజయ్) అనే ఇద్దరు మత్స్య కారుల మధ్య పోలీ నెలకొటుంది. ఈ క్రమంలో వారి జీవితంలో ఆస్తిపరుడైన నాగేసు (యేపూరి హరి) రాకతో వీళ్ల జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. ఈ క్రమంలో చోటు చేసుకునే పరిణామాలే ఈ సినిమా కథ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
‘రేవు’ అంటే సముద్రపు రేవు అని అర్ధంలో ఈ సినిమాను తెరకెక్కించారు. సముద్రం అదే గంగమ్మ తల్లిని నమ్మకున్న గంగపుత్రులు (మత్స్యకారులు) జీవితాల్లో జరిగే సంఘటనల సమాహారమే ‘రేవు’ సినిమా కథ. ఈ సందర్బంగా సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లే వాళ్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఎలా నిలబిడ్డారనే కథాంశమే ‘రేవు’ మూవీ స్టోరీ. ఈ క్రమంలో ఇద్దరు స్నేహతులు మధ్య వచ్చిన ఈగోతో వీరు ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేసారనేది దర్శకుడు ఎంతో ఎమోషనల్ గా తెరపై ఆవిష్కరించారు. అంతేకాదు సముద్రంలోకి వెళ్లే మత్స్య కారుల జీవితాలు అక్కడి తుఫానుల కారణంగా ఎలాంటి అలజడులకు లోనైవుతాయి. ఈ క్రమంలో వాళ్ల కుటుంబ సభ్యులు ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తారనేది మంచిగా ఎగ్జిక్యూట్ చేసాడు దర్శకుడు. సినిమాలో పాత్రల పరిచయాలు.. ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులను సీట్లపై కదలనీయదు. నటీనటులతో మంచి నటన రాబట్టుకొన్నాడు. ఎక్కడా కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఫీలింగ్ ఉండదు. ప్రీ క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. పాటలు సో, సో గా ఉన్నా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునే విధంగా ఉంది.
నటీనటుల విషయానికొస్తే..
ఈ సినిమాలో వంశీ రామ్ పెండ్యాల మత్స్యకారుడు పాత్రలో జీవించాడు. తన నటనతో మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్ లో రాణించాడు. హీరోగా మంచి భవిష్యత్తు ఉంది. మరోవైపు హేమంత, అజయ్ నిడదవోలు తమ పాత్రల్లో జీవించారు. హీరోయిన్ గా నటించిన స్వాతి కూడా మంచి నటనే కనబరిచింది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.
రేటింగ్..3/5
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి