Sandeham Movie Review: ‘సందేహం’ మూవీ రివ్యూ.. ఆడియన్స్ ను మెప్పించిందా.. !

సందేహం (Sandeham)

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 22, 2024, 09:51 PM IST
Sandeham Movie Review: ‘సందేహం’ మూవీ రివ్యూ.. ఆడియన్స్ ను మెప్పించిందా.. !

రివ్యూ: సందేహం (Sandeham)
నటీనటులు: హోబ్బా పటేల్, సుమన్ తేజ్, శ్వేత వర్మ, రశిక శెట్టి, శుభశ్రీ రాయగురు, చంద్రశేఖర్ రెడ్డి, సుందర్ పర్చ, ఫణి కుమార్
తదితరులు.
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి
సంగీత దర్శకుడు: సుభాష్ ఆనంద్
నిర్మాత:  సత్యనారాయణ పర్చ
దర్శకత్వం: సతీష్ పరంవేద
విడుదల:22/06/2024

హెబ్బా పటేల్ సుమన్ తేజ్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘సందేహం’. పూర్తి సందేహాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సంతీష్ పరంవేద తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఎలా వుందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
 

కథ విషయానికొస్తే..

హర్ష (సుమన్ తేజ్), శృతి (హెబ్బా పటేల్) ప్రేమించి పెద్దలను ఒప్పంచి పెళ్లి చేసుకుంటారు. అంతేకాదు హైదరాబాద్ లో ఓ ఫ్లాట్ లో ఉంటారు. ఫస్ట్ నైట్ ను మాత్రం కొన్ని రోజులు వాయిదా వేయమని కోరుతుంది శృతి. అంతేకాదు ఆమెకు దగ్గర అవ్వాలనే హర్ష చేసే ప్రతి ప్రయత్నంలో ఆమె తిరస్కరిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో శృతి మనసులో తను కాకుండా ఎవరైనా ఉన్నారా అనే అనుమానం హర్షకు వస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిబోతున్నట్టు కేంద్రం ప్రకటిస్తోంది. ఈ సందర్భంగా ఇంట్లో సరుకుల కోసం ఓ సూపర్ మార్కెట్ వెళితే.. అక్కడ అచ్చు హర్షలా ఉండే ఆర్య (సుమన్) శృతి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వీళ్లకు ఎదురు పడతాడు. అంతేకాదు తనకు శృతితో ఉన్న సంబంధం గురించి హర్షకు చెబుతాడు. అంతేకాదు అతడు హర్ష, శృతి ఉంటున్న ఎదురింటి ఫ్టాట్ లో దిగుతాడు. ఈ నేపథ్యంలో భార్య ప్రేమకు దూరమైన హర్ష, వాళ్ల జీవితంలో ప్రవేశించిన ఆర్యతో ఎలాంటి ఇబ్బందులు ఎదర్కొన్నాడు. ఈ క్రమంలో అతన్ని అడ్డు తొలిగించుకోవడానికి హర్ష ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో అతను ఆర్య అడ్డు తొలిగించుకొని భార్య ప్రేమకు దగ్గరయ్యాడా.. ? లేదా ? మరోవైపు కోవిడ్ బారిన పడ్డ హర్ష మరణించాడా.. ? ఇంతకీ శృతి జీవితంలో హర్ష మిగిలిడా.. ? తిరిగి ఆర్య ప్రవేశించాడా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు తాను చెప్పదలుచుకున్న సూటిగా కాకుండా థ్రిల్లింగ్ అంశాలతో చెప్పాలనుకున్నాడు. అక్కడక్కడ తడబడ్డా ఓవరాల్ గా తాను చెప్పాల్సిన విషయాన్ని తెరపై సూటిగానే చెప్పే ప్రయత్నం చేసి సినిమాను నిలబెట్టాడు. భార్య లేదా ప్రియురాలు ప్రేమకు గెలచుకోవడానికి ఓ భర్త పడరాని పాట్లు పడటం అనేది.. గతంలో షారుఖ్.. రబ్ దే బనాది జోడి సినిమాతో పాటు. శంకర్ అపరిచితుడు, పూరీ జగన్నాథ్  ‘ఇస్మార్ట్ శంకర్’ లను ప్రేరణగా తీసుకొని తనదైన శైలిలో కథను వండి వార్చాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ ఏదో సరదాగా సాగిపోయిన కథ..ఇంటర్వెల్ లో బిగ్ ట్విస్ట్ ఇవ్వడం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకిత్తించాడు. చివరి వరకు అదే టెంపోను కంటిన్యూ చేసుంటే బాగుండేది. కానీ మధ్యలో కథనం విషయంలో తడబడ్డ.. చివరగా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసాడు.  మొత్తంగా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించే ప్రయత్నం చేసాడు. ఈ సినిమాలో హీరో కరోనాతో చనిపోయాడనే ట్విస్ట్ ఆసక్తి రేకిస్తోంది. ఆ తర్వాత హీరో చెల్లెలి ఫోనుకు అన్న ఫోన్ నుంచి మిస్ డ్ కాల్ రావడంతో తన అన్న బతికే ఉన్నాడనే విషయాన్ని బయటపెట్టే జర్నలిస్టు పాత్రలో   హీరో చెల్లి పాత్రతో చెప్పించడం ఆసక్తి రేకిత్తించినా.. . ఆమె ఓ సైకో హ్యాకర్ ను నమ్ముతూ ఉంటుంది.  ఈమె ఫోన్ చేసినపుడల్లా.అతను. ఆమె ప్రైవేట్ పార్ట్స్  చూపించమంటూ బలవంత పెడుతూ ఉండటం ఇల్లీలాజికల్ గా అనిపిస్తుంది. ఒక జర్నలిస్టుకు  ఎవడు దొరకనంటూ ఓ సైకో హ్యాకర్ దొరకడం ఏంటో..తన పని కోసం అతను చెప్పినట్లు చేయడం పెద్ద విచిత్రంలా కనిపిస్తుంది. మొత్తంగా లాజిక్ లేని సీన్స్ పక్కన పెడితే..రొటిన్ భిన్నంగా  ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ఈ సినిమాకు ఆర్ఆర్ పెద్ద ఎస్సెట్. ఎడిటర్ తన కత్తెరకు మరింత పదను పెడితే బాగుండేది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల విషయానికొస్తే..

కొత్త నటుడైన సుమన్ తేజ్.. హర్షగా, ఆర్యగా రెండు విభిన్న పాత్రల్లో అలరించే ప్రయత్నం చేసాడు. అన్నప్రాసన రోజే అవకాయ అన్నం తిన్నట్టు ఫస్ట్ సినిమాలోనే మాస్ హీరోగా, నటుడిగా.. డాన్సర్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే తపన పడ్డాడు. మొత్తం విద్యలన్ని ఒకే సినిమాలో చూపిస్తే .. ఆ తర్వాత  చూపించడానికి ఏమి ఉండదు. ఈ విషయంలో సుమన్ తేజ జాగ్రత్త పడాలి. నటుడిగా మంచి భవిష్యత్తు ఉంది. హెబ్బా పటేల్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మరోసారి తన గ్లామర్ తో అలరించే ప్రయత్నం చేసింది. అంతేకాదు ఈ సినిమాలో నటనకు కాస్త స్కోప్ ఉన్న పాత్ర చేయడం విశేషం. శ్వేత వర్మ ఉన్నంతలో పర్వాలేదనిపించింది.మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేసారు.

ప్లస్ పాయింట్స్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

నిర్మాణ విలువలు

హెబ్బా పటేల్, సుమన్ తేజ్ నటన

మైనస్ పాయింట్స్
 

ఫస్ట్ హాఫ్

ఎడిటింగ్

లాజిక్ లేని సీన్స్

చివరి మాట.. ‘సందేహం’ ప్రేక్షకుల సందేహాలకు పెద్ద పజిల్..

రేటింగ్..2.75/5

Also Read: Kodali nani: మాజీ మంత్రి కొడాలి నానికి మరో బిగ్ షాక్.. గుడివాడలో కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News