అమెరికా పౌరులను మరో హరికేన్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే హార్వే, ఇర్వా తుఫాన్ల వలన అతలాకుతలమైన పలు అమెరికా ప్రాంతాలు ఇప్పుడు మరో హరికేన్ ప్రభావానికి లోను కానున్నాయి. ఇర్మా హరికేను వల్ల ఇప్పటికే నష్టాన్ని చవిచూసిన కరిబీయన్ దీవులను "మారియా" హరికేన్ తాకనుంది. దీని తాకిడి అప్పుడే 175 కిలోమీటర్ల వేగంతో మొదలై ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. త్వరలో ఈ హరికేన్ తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని అమెరికా నేషనల్ హరికేన్ సెంటర్ ప్రకటించింది.
అమెరికాలో తెలుగు వైద్యుడు దారుణ హత్యకు గురయ్యాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఎన్నారై మానసిక వైద్య నిపుణుడు నాగిరెడ్డి అచ్యుత్రెడ్డిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు. కాన్సాస్ లోని ఎడ్జ్మూర్లో క్లినిక్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన మృతదేహాన్ని పార్కింగ్ వెనక భాగంలో పోలీసులు గుర్తించారు. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. అచ్యుత్రెడ్డి వద్ద చికిత్స పొందుతున్న ఉమర్ రషీద్ అనే రోగి ఈ హత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడు.
పొట్టకూటి కోసం సౌదీ వెళ్లిన భారతీయ కార్మికులు రోడ్డున పడ్డారు. వేల మంది ఉద్యోగాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో తెలుగు కార్మికులు 80 వేల మంది ఉన్నట్లు సమాచారం. సౌదీ దేశ చట్టాల ప్రకారం కంపెనీలన్నీ విదేశీ కార్మికుల భారీ తగ్గించుకున్నాయి. ఈ పక్రియలో భాగంగా 14 శాతం విదేశీ ఉద్యోగులకు తొలగించారు. మరోవైపు ఉద్యోగాలు కోల్పోయిన వారు ఎలాగో అలా స్వదేశాలకు చేరుకుందామనుకుంటే ..కంపెనీ యాజమాన్యాలు పాస్ పోర్టులు, వీసాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు విదేశీ కార్మికులకు 3 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదు.
మన తెలుగు తేజం, మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెండ్ల రచయిత అవతారం ఎత్తబోతున్నాయి. ఈ మాట వింటుంటే ఆశ్చర్యమేస్తోంది కదూ...? ఇది ముమ్మాటికి నిజమండి... వివరాల్లోకి వెళ్లినట్లయితే మీకే అర్థమౌతుంది. ' హిట్ రిఫ్రెస్ ' పేరిట మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెండ్ల పుస్తకాన్ని రాస్తున్నారు. ఈ నెల 26వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ పుస్తకం విడుదల కానుంది. ఈ విషయాన్ని సత్యనాదెండ్ల స్వయంగా తన లింక్డ్ఇన్ లో పోస్టు చేశారు.
' హిట్ రిఫ్రెస్ 'లో ఏముంది..?
అమెరికాలో డీఏసీఏ స్కీం రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఆ దేశంలో నివసిస్తున్న భారతీయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. డీఏసీఏ స్కీం రద్దు వల్ల నష్టపోతారని భావిస్తున్న 8 లక్షల డ్రీమర్లలో భారతీయులు సైతం అధికంగా ఉన్నారని తేలింది. భారత దేశం నుంచి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమెరికా వెళ్లి అక్కడే పెరిగిన భారతీయులు సంఖ్య 20 వేల మంది వరకు ఉంటారని సౌత్ ఏషియన్ అమెరికన్స్ లీడింగ్ టుగెదర్ (సాల్ట్) లెక్కకడుతోంది.
డ్రీమర్స్ పథకాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. పిల్లలుగా ఉన్నప్పుడే అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారు తిరిగి స్వదేశానికి వెళ్లకుండా రక్షణ కల్పించే చట్టం డిఫర్ట్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ ఎరైవల్స్ (డిఎసిఎ) పథకం మునపటి అధ్యక్షుడు ఒబామా ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా డ్రీమర్స్కు కార్మిక అనుమతులు జారీ చేసేందుకూ వీలుకల్గింది. తాజా ఉత్తర్వులతో బాల్యంలో వలస వాదులను అమెరికాలో స్థిరపడ్డ వారికి ఎలాంటి రక్షణ ఉండబోదు. టెక్సాస్ నేతత్వంలో దాదాపు 9 రిపబ్లిక్ రాష్ట్రాల అటార్ని జనరల్స్ వత్తిడి మేరకు ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.