57-Year-Old Actress Marriage: 57 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధమవుతున్న ప్రముఖ నటి.. వరుడు ఎవరంటే?

Actress Marriage: రూ.4600 కోట్ల ఆస్తికి వారసురాలైన జుహీ చావ్లా.. దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపారి అయిన జయ మెహతా కి రెండవ భార్యగా వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పెళ్లి గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
 

1 /5

కన్నడ, హిందీ సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించిన.. జూహీ చావ్లా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. విక్కీ దాదా, కలియుగ కర్ణుడు వంటి చిత్రాలలో నటించింది. ఆ తర్వాత క్రేజ్ రావడంతో జుహీ చావ్లా పలు భాషలలో కూడా నటించి భారీ పాపులారిటీ సంపాదించుకుంది. 

2 /5

ప్రస్తుతం ఈమె వయసు 57 సంవత్సరాలు. ఈమె ఆస్తి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. రూ.4600 కోట్ల రూపాయలు ఉన్నదట. అలాంటి ఈమె.. ఒక వ్యాపారవేత్తకు రెండవ భార్యగా వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

3 /5

1990లో అత్యంత అందమైన నటీమణులలో ఒకరిగా పేరు సొంతం చేసుకుంది. తన నటన, అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈమె.. ఎన్నో విజయవంతమైన చిత్రాలలో కూడా నటించింది. ఈమె వయసు 57 ఏళ్లు.. అయినప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో కొన్ని కారణాలవల్ల నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంది.. 17 ఏళ్ల వయసులో మిస్ ఇండియా టైటిల్ని గెల్చుకున్న జుహీ చావ్లా. సుల్తానాద్ అనే చిత్రంతో 1986లో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.

4 /5

జుహీ చావ్లా 1995లో జే.మెహతా ను వివాహం చేసుకోగా.. అయితే మెహతాకు ఇదివరకే వివాహమయ్యిందట.  ఈయన భార్య సుజాత బిర్లా మరణించింది. సుజాత బిర్లా విమాన ప్రమాదంలో మరణించింది అనే విషయం తెలుసుకొని మెహతను చాలాసార్లు చూసి హృదయం చలించిపోయిందట. అలా వీరిద్దరి మధ్య మొదట ఉన్న స్నేహాన్ని ప్రేమగా మార్చుకొని వివాహం చేసుకున్నారట. అలా సుమారుగా వీరి సంబంధాన్ని ఆరేళ్ల పాటు రహస్యంగా ఉంచారట. జూహి చావ్లా తన మొదటి గర్భం దాల్చే వరకు వివాహ వార్తను బయటికి చెప్పలేదు.

5 /5

2400 కోట్ల రూపాయలతో జే.మెహతా ఇండియాలోని అత్యంత ధనవంత వ్యాపారిగా పేరు సంపాదించారు. ఇప్పుడు  సుమారుగా ఈయన ఆస్తి 4162 కోట్ల రూపాయలు ఉంటుందట. అలా ప్రపంచవ్యాప్తంగా 15000 మందికి పైగా ఈయన మొహతా గ్రూప్ కంపెనీలో పని చేస్తున్నారట. ఈ ఆస్తి అంతటికి కూడా జూహీ చావ్లానే యజమాని. ఇండియాలోని రిచెస్ట్ ధనవంతురాలుగా గత ఏడాది ఈమె పేరు భారతీయ నటిగా వెలుబడిందట.