Rakul Preet Singh Glamour: రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు హిందీలో కొన్ని బోల్డ్ సినిమాలు ఒప్పుకుంటూ దూసుకుపోతోంది. పెళ్లయిన తరువాత కూడా తన గ్లామర్ డోస్ తగ్గించలేదు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని ను ప్రేమించి వివాహం చేసుకోవడంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమైనట్టుగా కనిపిస్తోంది.ఇక బాలీవుడ్ లోనే పలు సినిమాలలో నటిస్తూ ఉన్న ఈ ముద్దుగుమ్మ తన భర్త నిర్మిస్తున్నటువంటి 'మేరీ హస్బెండ్ కీ బీవీ' అనే రొమాంటిక్ కామెడీ సర్కిల్ లవ్ స్టోరీ ఎంటర్టైన్మెంట్ చిత్రంలో నటిస్తూ ఉన్నది. రకుల్ ప్రీతిసింగ్ తో పాటుగా ఇందులో మరొక హీరోయిన్ భూమీ పడ్నేకర్ నటిస్తూ ఉన్నది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేయగా అందరిని ఆశ్చర్యపరిచేలా ఇందులో రకుల్ ప్రీతిసింగ్ కనిపిస్తూ ఉన్నది.
తాజాగా విడుదలైన ట్రైలర్ ని బట్టి చూస్తే ఈ సినిమా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో రాబోతున్నట్లు కనిపిస్తోంది.. ఫిబ్రవరి 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అర్జున్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ ట్రైలర్లో ముగ్గురు కూడా ఎవరికివారు పోటీ పడుతూ నటించేశారు అని చెప్పవచ్చు. పాస్ట్ భార్యగా భూమి పడ్నేకర్, ఫ్యూచర్ భార్యగా రకుల్ ప్రీత్ సింగ్ విపరీతంగా ఆకట్టుకున్నారు.
ముఖ్యంగా ఇందులో భూమి పడ్నేకర్ నుండి అర్జున్ కపూర్ దూరమైన తర్వాత ఆయనకు రకుల్ ప్రీత్ సింగ్ దగ్గరవుతుంది. ఇక ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఆయనకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. మళ్లీ భూమి అర్జున్ కపూర్ ను కావాలని కోరుకున్నప్పుడు, రకుల్ ప్రీత్ సింగ్, భూమి పడ్నేకర్ మధ్య జరిగిన సంఘటనలను చాలా అద్భుతంగా చూపించారు
రివేంజ్ డ్రామా లాగా అనిపిస్తున్న ఈ ట్రైలర్ ఆధ్యంతం నవ్వులు పూయిస్తోంది. ఇద్దరూ ఆడవారి మధ్య అర్జున్ కపూర్ పూర్తిస్థాయిలో నలిగిపోయినట్టు మనకు కామెడీ తరహాలో చాలా చక్కగా చూపించారు. ట్రైలర్లో బెడ్ రూమ్ లో రకుల్ ప్రీత్ సింగ్ అరుపులు పెడుతూ చూపించిన సన్నివేశం థియేటర్లలో ఈలలు వేయిస్తుందటంలో సందేహం లేదు.ముదస్సర్ అజీజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇందులో డినో మోరియా, ఆదిత్య సేల్, అనిత రాజ్, శక్తి కపూర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.