Indian Air Force Non Combatant Recruitment 2025: నిరుద్యోగ యువకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గుడ్ న్యూస్ తెలిపింది. అగ్నిపత్ పథకం కింద అగ్ని యోధుల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకోండి.
Indian Air Force Non Combatant Recruitment 2025: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మంచి ఉద్యోగం పొందాలనుకుంటున్నారా? ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేకమైన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అగ్నిపత్ పథకం కింద ప్రత్యేకమైన నోటిఫికేషన్ విడుదల చేస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీర్వాయు నాన్-కాంబాటెంట్(Indian Air Force Non Combatant Recruitment 2025)లో అగ్ని యోధుల ఖాళీ ఉన్న ఉద్యోగాలకు ప్రత్యేకమైన Recruitment చేపట్టింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అగ్నివీర్వాయు నాన్-కాంబాటెంట్‌లో అగ్ని యోధులకు సంబంధించిన నోటిఫికేషన్‌లో భాగంగా అన్ని రకాల అర్హతలను పేర్కొన్నారు. అయితే పదవ తరగతి చదువుకున్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చని ఈ నోటిఫికేషన్‌లో తెలిపారు. అలాగే ఇందులో ఎంపికైన వారికి దాదాపు రూ.30,000 ఉంటుందని తెలిపింది.
ఈ అగ్ని యోధుల ఉద్యోగులను సులభంగా ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దీని కోసం https://agnipath vayu.cdac.in అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ అప్లికేషన్‌కు సంబంధించిన చివరి తేదిని కూడా నోటిఫికేషన్‌లో తెలిపారు. ఫిబ్రవరి 24లోపే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఎయిర్ ఫోర్స్ పోస్టులకు సంబంధించిన జీతాలకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ. 30,000 నుంచి రూ.40,000 చెల్లిస్తారని నోటిఫికేషన్‌లో తెలిపారు. అంతేకాకుండా అదనంగా డ్రెస్, దుస్తులతో పాటు ట్రావెల్ అలవెన్సులు, ఉచితంగా రేషన్స్‌ను కూడా అందిస్తోంది.
అలాగే జీతంతో పాటు ప్రత్యేకంగా లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC) సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. ఇక దీనిని అప్లై చేసుకునే అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించనక్కర్లేదు.. ఈ పోస్టులకు అప్లై చేసుకునేవారు 2004 సంవత్సరం కంటే ముందే జన్మించిన వారు అభ్యర్థులుగా నోటిఫికేషన్‌లో తెలిపారు.
ఇక విద్యా అర్హతల వివరాల్లోకి వెళితే.. 25 ఫిబ్రవరి 2025 నాటికి పదోతరగతి పాస్ అయిన వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎత్తు 152 సెం.మీ పైగా ఉండాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ https://agnipathvayu.cdac.inలో చూడవచ్చు..