Best Unlimited Prepaid Plans Under Rs 500: బెస్ట్ అన్‌లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్స్.. వివరాలు ఇవే

  • Nov 29, 2020, 12:49 PM IST

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వినియోగం చాలా పెరిగిపోయింది. ప్రతి పనికి ఆన్‌లైన్ అంటున్నారు. ఏదో పని కోసమైనా ఇంటర్నెట్‌ను వాడుతున్న కస్టమర్లు ఉన్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పలు రకాల యాప్స్‌, ఈ కామర్స్ వెబ్‌సైట్స్ రావడంతో రీఛార్జ్ ప్లాన్ తీరు మారిపోయింది. ఎంత రీఛార్జ్ చేయించుకుంటున్నాం, దానికి ఏ ప్రయోజనం ఉందని చెక్ చేసుకుంటారు. గతంలో రూ.50, రూ.100 రీఛార్జ్ చేసుకునే కస్టమర్లు ప్రస్తుతం రూ.500 వరకు ఈజీగా రీఛార్జ్ చేసుకుంటున్నారు. కొన్ని రీఛార్జ్ ప్లాన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

1 /5

2 /5

రూ.500 లోపు ధరలో బెస్ట్ అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.449కి Airtel అందిస్తోంది. 56 రోజుల వాలిడిటీ ఉన్న ఈ అన్‌లిమిటెడ్ ప్లాన్‌లో ఏ నెట్‌వర్క్‌కు అయినా  వాయిస్ కాలింగ్ అందిస్తుంది. అలాగే రోజుకు 2 GB డేటా, వంద ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. దీని కాలపరిమితి 56 రోజులు. ఈ ప్లాన్ ద్వారా పలు ఓటీటీల బెనిఫిట్ పొందవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియంతో పాటుగా షా అకాడమీ, వింక్ మ్యూజిక్ ఏడాది వరకు ఉచితంగా లభిస్తాయి.

3 /5

BSNLలో STV_247 ప్రీపెయిడ్ ప్లాన్. ఇది అన్‌లిమిటెడ్ ప్లాన్ కావడంతో కస్టమర్లు ఈ ప్లాన్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో ప్రతిరోజూ 3 జీబీ డేటా లభిస్తుంది. ప్రతిరోజూ 250 నిమిషాల ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తుంది. 40 రోజులవరకు ప్రతిరోజూ వీరికి 100 SMSలు చేయవచ్చు. 

4 /5

టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది జియో. ఇందులో రూ. 444 ప్లాన్ బెస్ట్ అన్‌లిమిటెడ్ ప్లాన్ ఉంది. రూ.500లోపు ఇది మంచి ప్లాన్. 56 రోజుల వరకు ప్రతిరోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. 2000 నిమిషాల నాన్ జియో కాలింగ్ సౌకర్యం అందుతుంది. సంస్థకు చెందిన కస్టమర్లు జియో టీవీ కూడా వీక్షించవచ్చు. ఎస్ఎంఎస్‌లు కూడా చేసుకోవచ్చు. Also Read : Bigg Boss Telugu 4: కంటెస్టెంట్ Monal Gajjar ప్రతి వారం ఎలా సేవ్ అవుతుందో తెలుసా?

5 /5

వీఐలో రూ.449కి బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ఉంది. ఇది అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్. ఇందులో డబుల్ డేటా ప్లాన్ కింద ప్రతిరోజూ 4GB డేటా వస్తుంది. రోజూ 100 ఎస్ఎంఎస్‌లతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్‌ సౌకర్యం కల్పిస్తారు. రూ.449 ప్లాన్ వాలిడిటీ 56 రోజులు. ఈ ప్లాన్‌లో వీకెండ్ డేటా రోల్ ఓవర్ కూడా పొందవచ్చు. వీటితో పాటు మరిన్ని సౌకర్యాలను సంస్థ తన కస్టమర్లకు అందిస్తోంది. Also Read : Best LIC Policies: 5 బెస్ట్ ఎల్ఐసీ పాలసీలు ఇవే..