Amitabh Bachchan: రియల్‌ ఎస్టేట్‌ అంటే ఇదే! రూ.31 కోట్ల ఆస్తిని రూ.83 కోట్లకు అమ్మిన అమితాబ్‌ బచ్చన్‌

Amitabh Bachchan Gets 160 Percentage Plus Profit With Sold Of His House: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అనేది తెలివిగా చేస్తే కొన్నేళ్లలో ఊహించని లాభాలు పొందవచ్చు. అలాంటి సూత్రాన్నే నమ్మిన సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నాలుగేళ్లలోనే 160 శాతం లాభాలు పొందాడు. ముంబైలోని తన ఇంటిన అత్యంత లాభంతో విక్రయించడంతో అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి వార్తల్లోకెక్కారు.

1 /6

బాలీవుడ్‌ను సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కొన్నేళ్ల నుంచి శాసిస్తున్నాడు. వందలాది సినిమాలు చేసిన అమితాబ్‌ బచ్చన్‌ హిందీ పరిశ్రమలోనే అత్యంత సీనియర్‌ నటుడు. ముంబైలో నివసిస్తున్న అమితాబ్‌కు సంబంధించిన తాజా వార్త నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

2 /6

ముంబైలో నివసిస్తున్న అమితాబ్‌ బచ్చన్‌కు భారీగా ఆస్తులు ఉన్నాయి. వాటిలో ఒక కీలకమైన ఇంటిని తాజాగా బిగ్‌ బీ విక్రయించాడు. అయితే ఊహించని లాభాల్లో అమ్మడంతో సినీ పరిశ్రమతోపాటు రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.

3 /6

ముంబైలోని ఓషివార ప్రాంతంలో ఉన్న ఇంటిని అమితాబ్‌ బచ్చన్‌ ఈనెలలో విక్రయించాడు. ఆ ఇంటిని రూ.83 కోట్లకు విక్రయించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి పడింది.

4 /6

ఇంతలా చర్చ జరగడానికి కారణం ఆ భవనాన్ని అమితాబ్‌ బచ్చన్‌ కొన్నది కేవలం రూ.31 కోట్లకు మాత్రమే. ఒకటిన్నర ఎకరంలో ఉన్న ఆ ఇల్లు అత్యంత విలాసవంతమైనది. 2021 ఏప్రిల్‌లో ఈ ఇంటిని కొనుగోలు చేసిన బిగ్‌ బీ హీరోయిన్‌ కృతి సనన్‌కు అద్దెకు ఇచ్చాడు. నెలకు రూ.10 లక్షల చొప్పున అద్దెకు ఈ ఇంటిని అప్పగించాడు.

5 /6

డూప్లెక్స్‌ అపార్ట్‌మెంట్‌లో 4, 5, 6 బెడ్రూమ్‌ ఫ్లాట్లు ఉన్నాయి. మొత్తం ఆరు కారు పార్కింగ్‌ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ఇంటిలో అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. రోడ్డు వైపున ఉండడం.. ఖరీదైన ప్రాంతంలో ఉండడంతో భారీ ధరకు ఈ అపార్ట్‌మెంట్‌ అమ్ముడుపోయింది.

6 /6

అయితే రూ.31 కోట్లకు భవనం కొని నాలుగేళ్లలోనే రూ.83 కోట్లకు విక్రయించేసిన అమితాబ్‌ బచ్చన్‌ ఏకంగా 160 శాతం లాభాలు పొందడం చూసి ముంబై రియల్‌ ఎస్టేట్‌ రంగం విస్తుపోయింది. ప్రస్తుతం అమితాబ్‌ బచ్చన్‌ కల్కి సినిమాలో చేస్తుండగా.. అంతకుముందు రజనీకాంత్‌ వెట్టాయన్‌లో చేసిన విషయం తెలిసిందే.