YS Jagan Mohan Reddy: చంద్రబాబువి డప్పాలు.. పిట్టల దొర డైలాగులు.. సీఎంపై చండ్ర నిప్పులు కురిపించిన జగన్..

YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు తమిళనాడు తరహాలో కక్షలు, ప్రతికారాలకు నిలయంగా మారింది. ఈ రోజు ఏపీ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మాజీ సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబును విమర్శిస్తూ ఎక్స్ లో పెద్ద పోస్ట్ చేశారు.

1 /9

YS Jagan Mohan Reddy: చంద్రబాబు గురించి చెప్పాలంటే మాయ చేస్తాడు..మభ్య పెట్టి ప్రజలను వంచించడమే ఆయన నైజం అన్నారు. దీనికోసం ఎన్ని వేశాలు వేయాలో అన్ని వేస్తాడన్నారు. శ్రీశైలం టూ విజయవాడ సీ ప్లేన్ పర్యటన పెద్ద హంబక్ అన్నారు. కంప్యూటర్లు, సెల్ ఫోన్లు తానే కనిపెట్టాని 20 యేళ్లుగా బిల్డప్ ఇచ్చే చంద్రబాబు.. తాజాగా సీ - ప్లేన్ మీద కొత్త కథలు అల్లుతున్నాడన్నారు.

2 /9

మన దేశంలోనే ఫస్ట్ టైమ్ అన్నట్టుగా, మరెక్కడా లేనట్టుగా, సీ-ప్లేన్‌ నడిపితే చాలు రాష్ట్రం అభివృద్ధి చెందినట్టుగా ఫోజులు కొడుతున్నారన్నారు. చంద్రబాబుగారి బిల్డప్‌, ఎల్లోమీడియా డప్పాలు చూస్తుంటే పిట్టలదొర డైలాగులు గుర్తుకు వస్తున్నాయి. ఓవైపు వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల సంపద క్రియేట్ చేసిన మెడికల్ కాలేజీలతో పాటు, పోర్టులను ప్రైవేటుపరం చేస్తూ పెద్ద స్కామ్ కు తెగబడ్డారన్నారు. దీన్ని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీ -ప్లేన్ అంటూ కొత్త పబ్లిసిటీ  స్టంట్స్ చేస్తున్నారన్నారు. 

3 /9

సీ-ప్లేన్‌ అన్నది ఇప్పటిది కాదు. దాదాపు 114 ఏళ్ల క్రితమే 1910లో నుంచి ఉంది. మన దేశంలో కేరళలో 2013లో మొదలయ్యి తర్వాత కొన్ని సాంకేతిక కారణాలతో ఆపేశారు. గుజరాత్‌లో 2020లో సర్వీసులు నడవటం మొదలుపెట్టినా అవికూడా ఆగిపోయాయి.  ప్రతి రాష్ట్రంలోనూ అనేక రిజర్వాయర్లు, డ్యాంలు ఉన్నాయి. మరి ఎందుకు ఆయా రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయోగాలు కొనసాగడం లేదన్నారు.

4 /9

ఆపరేషన్స్‌లో తీవ్ర ఇబ్బందులు ఏర్పడటం.. సాంకేతిక కారణాలు.. ప్రయాణికుల భద్రతాపరమైన అంశాలనతోపాటు నిర్వహణా భారం దీనికి ప్రధాన కారణాలన్నారు. 14 మంది ప్రయాణికుల సీ-ప్లేన్‌ సర్వీసులను అభివృద్ధికి ఒక ప్రమాణంగా చంద్రబాబు గొప్పగా చెప్పుకోవడం, దాన్ని వారి మీడియా కీర్తించడం చూస్తుంటే పరస్పరం డప్పాలు కొట్టుకోవడం కాదా అని ప్రశ్నించారు.

5 /9

ఆంధ్ర ప్రదేశ్ లో సుధీర్ఘ తీర ప్రాంతాన్ని  వినియోగించుకుని మెరుగైన వాణిజ్యాన్ని, రాష్ట్రానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చడం వంటివి అభివృద్ది అవుతుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగంలో పోర్టులు కట్టడం అభివృద్ది అవుతుందా.. ? లేక సీ-ప్లేన్‌లో తిరిగి ఈ పోర్టు ఆస్తులను తెగ నమ్మడం అభివృద్ది, సంక్షేమం అవుతుందా అని ప్రశ్నించారు. పోర్టుల వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందా.. ? సీ- ప్లేన్ వల్ల అని ప్రశ్నించారు.

6 /9

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, పోర్టుల రూపేణా మొత్తంగా రూ.21,734కోట్ల పబ్లిక్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్రజల ఆస్తికాదా? ప్రజలకోసం సృష్టించిన సంపద కాదా చంద్రబాబూ? రాష్ట్రచరిత్రలో ప్రభుత్వరంగంలో ఇన్ని పెట్టుబడులు ఎప్పుడైనా పెట్టారా? అని ప్రశ్నించారు. మా ప్రభుత్వం హయాంలో నిర్మాణాలు జరుపుకున్న కాలేజీలు, పోర్టులన్నీకూడా ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఇవాళ రాష్ట్ర ప్రజల కళ్లముందు కనిస్తున్నాయి.  ఇవన్నీ వైయస్సార్‌సీపీ ప్రభుత్వం సృష్టించిన సంపద కాదా? ఈ ఆస్తులు విలువ భవిష్యత్తులో లక్షల కోట్లు కాదా? ఇదంతా అభివృద్ధి కాదా?

7 /9

సంపద సృష్టించడమంటే ప్రభుత్వ రంగంలో పోర్టులు నిర్మించడం. దాని ద్వారా అభివృద్ది చేసి ఆదాయం క్రియేట్ చేయడం.   ప్రభుత్వ రంగంలో మెడికల్‌ కాలేజీలు కట్టి ప్రజలకు అందుబాటులోకి ఉచితంగా నాణ్యమైన, అత్యాధునిక వైద్యాన్ని అందించడం వంటివి నిజమైన అభివృద్ది. సీ-ప్లేన్‌మీద పబ్లిసిటీ స్టంట్లు కావు.

8 /9

చంద్రబాబు… రూ.8,480 కోట్లతో ప్రభుత్వ రంగంలో, మారుమూల ప్రాంతాల్లో అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులోకి తేవడం అభివృద్ది. కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు కట్టడం సంపద సృష్టి అవుతుందా? లేక వాటిని ప్రయివేటు పరం చేయడం అభివృద్ది అవుతుందా అని ప్రశ్నించారు. 

9 /9

చంద్రబాబు నాయుడు గారూ.. మీరు, మీ పార్టీ నాయకుల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధిగా పేర్కొంటున్నారు.  మీరు, మీమనుషులు ఆస్తులు కూడబెడితే అది ప్రజల కోసం క్రియేట్ చేసిన సంపద అని చెప్పుకుంటున్నారు. మీ దృష్టిలో అభివృద్ది, సంపద సృష్టి అంటే ఇదేనేమో అని చెప్పుకొచ్చారు.  ప్రభుత్వం రంగంలో మంచి స్కూల్స్‌ లేకుండా చేయడం, మంచి వైద్యాన్ని అందించే మెడికల్‌ కాలేజీలు లేకుండా చేయడం అభివృద్దా ..? మంచి పోర్టులు లేకుండా చేసి, చివరకు ప్రజల ఆస్తులను వారికి కాకుండా చేయడం అభివృద్ది అవుతుందా అని ప్రశ్నించారు.