బరువు తగ్గడానికి మీరు చేసే వర్కవుట్స్ రిపీట్ చేస్తూ ఉంటే శరీరం స్పందించడం మానేస్తుంది. దాంతో మీరు కోరిన ఫలితాలు అందవు. అందుకే మీరు కొత్త కొత్త వర్కవుట్స్.. కొంచెం కఠినమైన ఎక్సర్సైజ్లు చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు మీరు వర్కవుట్స్ చేసే ఫ్రీక్వెన్సీని మార్చాల్సి ఉంటుంది. రెసిస్టెన్సీ ట్రైనింగ్ కూడా తీసుకోవడం మంచిది.
మీరు ఎన్ని కేలరీస్ తీసుకుంటున్నారో.. ఒక అంచనా ఉండటం చాలా అవసరం. మీరు తీసుకున్న కేలరీస్ కన్నా ఎక్కువ బర్న్ చేయడానికి ప్రయత్నించండి.
స్లిమ్ అవ్వడానికి అన్నం తినడం మానేయాలి అని మీకు ఎవరైనా చెబితే.. అది మీరు వినే అతిపెద్ద అబద్ధం అని అర్థం చేసుకోండి. అలాగే వర్కవుట్స్‌కు ముందు, తరువాత ఆహారం తినడం మానేయాలి అని అంటే కూడా అది కూడా అపోహనే. ఇది మిమ్మల్ని వీక్‌గా మార్చేస్తుంది. అందుకే జిమ్‌కు వెళ్లేముందు ఏదైనా తిని వెళ్లండి. ఇలా చేయడం వల్ల మీకు వర్కవుట్స్ చేసే శక్తి లభిస్తుంది.
వర్కవుట్ చేసిన తరువాత కూడా ఏదైనా ఆహార పదార్థం తినడం మర్చిపోవద్దు. ఇది మీ కండరాల పనితీరును పెంచుతుంది.
బరువు తగ్గే క్రమంలో శరీరానికి కావాల్సిన మేరకు మంచినీరు తాగడం అవసరం. డీహైడ్రేసన్ వల్ల కేలరీస్ ఎక్కువగా తీసుకోవాలి అని అనిపిస్తుంది. అలా జరిగితే మీరు మరింతగా బరువు పెరుగుతారు. అందుకే కడుపునిండుగా నీరు తాగండి.