Balakrishna- Thaman: నటసింహ నందమూరి బాలకృష్ణ ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ చిత్రాలకు, ఎస్.ఎస్.తమన్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు అయితే ఇప్పుడు ఈయనను దూరం పెడుతున్నట్లు సమాచారం.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ, ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు. అంతేకాదు ఈ సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు బాలయ్య. ముఖ్యంగా బాలయ్య సినిమాలు కథపరంగానే కాకుండా మ్యూజికల్ హిట్టుగా కూడా నిలవడానికి కారణం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. ఎస్.తమన్ అని చెప్పవచ్చు
అఖండ సినిమా మొదలుకొని ఇటీవల విడుదలైన డాకు మహారాజ్ సినిమా వరకు తమన్ బాలకృష్ణ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఇవన్నీ కూడా మ్యూజికల్ పరంగా బ్లాక్ బస్టర్ అయ్యాయి. బాలకృష్ణ మాస్ ఎలివేషన్స్ కి చక్కని బిజిఎం అందిస్తూ బాలకృష్ణ సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్.. కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు.అందుకే బాలకృష్ణ సినిమా అంటేనే తమన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.దీనికి తోడు మొన్నామధ్య బాలకృష్ణ కూడా ఎస్ఎస్ తమన్ కాదు నందమూరి తమన్.. అంటూ తమన్ ను తమ కుటుంబ సభ్యులలో ఒకరిగా పరిగణించిన విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న అఖండ 2కి కూడా తమన్ సంగీతాన్ని అందించబోతున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని డైరెక్షన్లో రాబోయే మూవీకి తమన్ ను తప్పించి, అనిరుద్ ను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.
కోలీవుడ్లో రజనీకాంత్ జైలర్ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా విపరీతమైన క్రేజ్ అందుకున్న ఈయన, రజనీకాంత్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఇప్పుడు టాలీవుడ్ లో పాగా వేయడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అనిరుద్ ను బాలకృష్ణ తన సినిమాకి తీసుకోబోతున్నట్లు సమాచారం.
ఇక ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమన్ ను బాలకృష్ణ పక్కన పెట్టబోతున్నాడు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా బాలయ్య సినిమాకి తమన్ ను తప్పించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే గోపీచంద్, బాలకృష్ణ కాంబినేషన్లో రాబోయే సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అని త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడబోతోందని సమాచారం. ఇకపోతే 2023లో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వీరసింహారెడ్డి సినిమా వచ్చిన విషయం తెలిసిందే.