Samantha Dating; సమంత పికిల్ బాల్ టోర్నమెంట్ లో చెన్నై జట్టుకి యజమానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ లో భాగంగా సమంత చేసిన పని ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. టోర్నమెంట్ ఆరంభోత్సవ సమయంలో రాజ్ చెయ్యి పట్టుకొని కనిపించింది.
సినిమాల విషయం పక్కన పెడితే.. తన పర్సనల్ లైఫ్ విషయాల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది ఈ హీరోయిన్. ముఖ్యంగా ఈ మధ్య డేటింగ్ వార్తల్లో నిలుస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది ఈ ముద్దుగుమ్మ.
నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత.. ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరు తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఈ వార్తలు మరింత ఉపందుకున్నాయి. ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించిన ఈ దర్శకుడితో.. ఈ హీరోయిన్స్ సన్నిహితంగా ఉంది అంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొత్తగా.. ఆమె ఏకంగా అతన్ని.. ప్రేమిస్తుంది అంటూ ఎన్నో రూమర్స్ వినిపిస్తూ వచ్చాయి
మొన్న మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా ఇతడి నుంచి మెసేజ్ వచ్చినప్పుడు ఈమె ముఖం మెరిసిపోయిందని ఆమె సన్నిహితులు కూడా తెలియజేశారు. అయితే ఇప్పుడు నేరుగా అతడితో డేటింగ్ లో ఉందనడానికి..కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.
తాజాగా పికిల్ బాల్ టోర్నమెంట్ లో చెన్నై జట్టుకి యజమానిగా ఉన్న సమంత.. టోర్నమెంట్ ఆరంభోత్సవ సమయంలో రాజ్ చెయ్యి పట్టుకొని కనిపించింది.దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలకు మరింత ఆజ్యం పోసినట్టు అయింది. ముఖ్యంగా నాగచైతన్య అభిమానులు ఈ విషయాన్ని మరింత వైరల్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఇది చాలా సర్వసాధారణమని…తను అతన్ని స్నేహితుడిగా భావించి కూడా అలా పట్టుకుని ఉండొచ్చు అని కూడా అంటున్నారు.ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.