Brahmanandam as Villain: బ్రహ్మానందం ఈ పేరు చెబితేనే తెలియని గిలిగింత ప్రేక్షకులకు కలుగుతాయి. ఆయన కమెడియన్ గా ప్రేక్షకులకు తెలుసు. కానీ ఈయన విలన్ గా కూడా వేల మీద లెక్కపెట్టే సినిమాల్లో నటించారు. ఇంతకీ బ్రహ్మీ విలన్ గా నటించిన ఆ సినిమాలేంటో చూద్దాం..
Brahmanandam as Villain: బ్రహ్మానందం ఈ పేరు చెప్పగానే తెలియకుండానే మన ముఖాలు నవ్వులతో వెలిగిపోతాయి. ఇక బ్రహ్మి విషయానికొస్తే.. ఈయన తెలుగు సినిమాకు ఖాన్ దాదా అయినా.. మైఖేల్ జాక్సన్ అయినా.. కత్తి రాందాస్ అయినా..పద్మశ్రీగా ప్రేక్షకులను గిలిగింతలు పెట్టారు.
ప్రస్తుతం హార్ట్ ఆపరేషన్ తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. రంగమార్తండ త్వరలో కుమారుడుతో కలిసి ‘బ్రహ్మా ఆనందం’ సినిమాతో పలకరించబోతున్నారు. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న బ్రహ్మీ కొన్ని చిత్రాల్లో విలనిజం ఉన్న పాత్రల్లో నటించి మెప్పించారు.
అవును బ్రహ్మానందం అప్పట్లో విడుదలైన ప్రతి తెలుగు చిత్రంలో ఉండాల్సిందే అనేలా నటించి మెప్పించారు. బట్టతలతో సినీ ఎంట్రీ ఇచ్చి క్లాస్ నుంచి మాస్ వరకు బాల్కనీ నుంచి నేల టిక్కెట్ అనే తేడా లేకుండా అందిరితో సీటీలు వేయించగల స్టార్ బ్రహ్మా ఒక్కరే.
తెలుగులో కొత్త కమెడియన్స్ రాకతో తెలుగులో బ్రహ్మానందం హవా కాస్తంత తగ్గిందని చెప్పేకంటే బ్రహ్మీ స్వయంగా తన సినిమాలను తగ్గించుకున్నారు. అయితే బ్రహ్మానందం రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ‘చిక్కడు దొరకడు’ సినిమాతో పాటు చిరంజీవి హీరోగా నటించిన ‘స్నేహం కోసం’ సినిమాతో పాటు ‘దూకుడు’, ఆగడు వంటి చిత్రాల్లో విలన్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించారు.
పూర్తి స్థాయి విలన్ గా కాకుండా.. కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించడం విశేషం. బ్రహ్మీ తన కెరీర్‌లో అతి తక్కువ టైమ్‌లో వెయ్యి సినిమాలకు పైగా నటించి గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించుకున్న అతి కొద్ది నటుల్లో ఆయన ఒకరు. అంతేకాదు తన జీవిత చరిత్రపై తనే ఆత్మకథ కూడ రాసుకోవడం విశేషం.
బ్రహ్మానందంలో మంచి చిత్ర కారుడు కూడా ఉన్నారు. వీలైనపుడల్లా పెయింటింగ్స్ గీస్తూనే ఉంటారు. ఇక కేంద్రం సినీ రంగానికి ఈయన సేవలకు గాను 2009లో పద్మశ్రీతో గౌరవించింది. ఆ సంగతి పక్కన పెడితే.. తెలుగులో మోస్ట్ వాంటెడ్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న ఈయన ఒక్కో కాల్షీటుకు రూ. లక్ష వరకు తీసుకుంటున్నారు.
అంతేకాదు తాను సంపాదించిన డబ్బుల్లో రియల్ ఎస్టేట్ వంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రూ. 700 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఏ దురలవాట్లు లేని కారణంగా బ్రహ్మీ ఈ రేంజ్‌లో కూడబెట్టగలిగాడని అందరు చెప్పుకుంటారు.