RBI Cancelled Bank Holiday On March 31st Of Ramadan: బ్యాంకు ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. క్యాలెండర్‌లో ప్రకటించిన సెలవును అనూహ్యంగా ఆర్‌బీఐ రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకు ఉద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఏం జరిగింది? ఎందుకు సెలవు రద్దు చేశారనేది తెలుసుకుందాం.
ప్రజల ఆర్థిక వ్యవహారాలను నడిపించే బ్యాంకులకు సెలవులు ఏడాది ముందే నిర్ణయిస్తారు. ఏడాదికి సంబంధించిన సెలవుల క్యాలెండర్‌ను ముందే విడుదల చేస్తారు. దీంతో బ్యాంకు ఉద్యోగులు సెలవులను సద్వినియోగం చేసుకుంటుంటారు.
ముందే నిర్ణయించిన సెలవు అనూహ్యంగా రద్దయ్యింది. సెలవు రద్దు కావడంతో బ్యాంకు ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు నిరాశకు గురయ్యారు.
మార్చి 31వ తేదీన ముస్లింల అతిపెద్ద పండుగ ఈద్ ఉల్ ఫితర్ ఉంది. రంజాన్ పండుగకు బ్యాంకులకు జాతీయ సెలవు ఉంటుంది. ఈ క్రమంలో బ్యాంకులకు కూడా సెలవు ప్రకటించారు. అయితే అదే రోజు ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది.
మార్చి 31వ తేదీన రంజాన్ పండుగ సెలవు బ్యాంకులకు ఉండగా దానిని ఆర్‌బీఐ తాజాగా రద్దు చేసింది. ఆర్థిక సంవత్సరం చివరి తేదీ కావడంతో అన్ని లావాదేవీలు పూర్తి కావాలనే ఉద్దేశంతో సెలవును రద్దు చేస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది.
మార్చి 31వ తేదీన సెలవు ఇస్తే బ్యాంకు లావాదేవీలన్నీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోపే లావాదేవీలు పూర్తి చేయాలనే భావనతో రంజాన్ రోజు సెలవును ఆర్‌బీఐ రద్దు చేసింది.
ఆర్థిక సంవత్సరం చివరి రోజు మార్చి 31 కావడంతో బ్యాంకు ఉద్యోగులు తప్పనిసరిగా ఆ రోజు విధులకు రావాల్సి ఉంది. బ్యాంకు లావాదేవీలన్నీ పూర్తి చేసిన తర్వాతనే బయటకు వెళ్లాల్సి ఉంది. అందుకే ఈ ఒక్క రోజు బ్యాంకు ఉద్యోగులు అర్ధరాత్రి వరకు కూడా పని చేస్తుంటారు.