Haryana Assembly Elections Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్‌లో తృటిలో పతకాన్ని చేజార్చుకున్న వినేశ్ ఫొగట్ రాజకీయాల్లో కూడా విజయం సాధించకుండా వెనుతిరిగింది. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వినేశ్ తొలి ఎన్నికల్లోనే ఓటమిని చవిచూడడం గమనార్హం. ఆమెకు ఎక్కడా కలిసి రాకపోవడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు రాజకీయాల్లోనూ ఎదురు దెబ్బ తగిలింది.
పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లిన వినేశ్ ఊహించని రీతిలో బరువు పెరిగారనే కారణంతో ఆమెపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
అధిక బరువు కారణంగా ఫైనల్లో పోటీ చేయకపోవడమే కాకుండా ఏకంగా టోర్నీ నుంచే బహిష్కరణకు గురైన వినేశ్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది.
అనంతరం స్వదేశం చేరుకుని తన స్వరాష్ట్రం హర్యానాలో వినేశ్ ఫొగట్ రాజకీయాల్లోకి ప్రవేశించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరి జులానా అసెంబ్లీ స్థానం నుంచి వినేశ్ ఫొగట్ పోటీ చేశారు.
తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో వినేశ్ ఫొగట్ వెనుకంజలో ఉన్నారు.
ఒలింపిక్స్‌లో వెంటాడిన దురదృష్టం రాజకీయాల్లోనూ కొనసాగడంతో వినేశ్‌కు తీవ్ర నిరాశ మిగిల్చింది.
ఫలితాల్లో రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం లభించకుండా వెనుకంజలో కొనసాగుతుండడంతో వినేశ్ ఫొగట్ కౌంటింగ్ కేంద్రం నుంచి నిరాశతో వెనుదిరిగారు.