Business Idea: ఆమెకు లోన్ ఇచ్చేందుకు మొదట నిరాకరించారు. ఆమె చేస్తున్న పని గురించి తెలుసుకున్న తర్వాత పిలిచి మరీ రూ. 10లక్షల వరకు లోన్ ఇచ్చారు. ఆ మహిళ చేస్తున్న బిజినెస్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు.
తమిళనాడుకు చెందిన దీప, రవి కుమార్ దంపతులు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో చిన్న పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నారు. మహిళా సంఘం ద్వారా లోన్ తీసుకుని తినుబండారాలను తయారు చేస్తున్నారు.
కృషి,పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆ మహిళ నిరూపించింది. రాష్ట్రం కానీ రాష్ట్రానికి తోటి మహిళలను ఒప్పించి మహిళా సంఘం నుంచి లోన్ తీసుకుంది. అనంతరం చిన్న కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసుకుని లక్షల్లో సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో తమిళనాడుకు చెందిన దీప, రవికుమార్ దంపతులు గత 30ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నారు.
వీరు చిన్న కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. మరుకులు, బొంగులు, తెల్ల మురుగులు, పుట్నాలు, కారా, బొంది ఇలా ఎన్నో రకాల చిరు తినుబండారాలను తయారు చేసి వాటిని కిరాణా షాపుల్లో విక్రయిస్తూ చిన్న కుటీర పరిశ్రమను నడిపిస్తున్నారు.
వాటికి అవసరమైన మిషన్స్, ప్యాకింగ్ మిషన్, పిండి కలిపే యంత్రాలను లోన్ ద్వారా తీసుకుని అంచలంచెలుగా ఎదిగారు.
ప్రస్తుతం నెలకు లక్షల్లో టర్నోవర్ చేస్తున్నారు. మొదట మహిళా సంఘం గ్రూపులో తను చేర్చుకునేందుకు సభ్యులు అభ్యంతరం చెప్పారని దీప తెలిపింది.
డ్వాక్రా గ్రూప్ లో చేరిన తర్వాత 2003లో 10వేల లోన్ తీసుకుంది.
ప్రతినెల క్రమం తప్పకుండా కట్టింది. ఈ రోజు 10లక్షల లోన్ తీసుకుని మిషనరీస్ ఏర్పాటు చేసుకుని ఎక్కువ మొత్తంలో తినుబంగారాలను తయారు చేస్తున్నామని తెలిపారు. తాము తయారు చేసే తినుబండారాలు మూడు నెలల వరకు గ్యారెంటీ ఇస్తున్నారు.