Funmoji: హీరోగా ఫన్‌మోజీ ఫేమ్ సుశాంత్ మహాన్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Funmoji Sushanth Mahaan New Movie: ఇటీవల సోషల్ మీడియాలో ఫేమ్‌తో చాలా మంది సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఫన్‌మోజీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూట్యూబ్‌లో ఫన్‌మోజీ కంటెంట్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ ఫన్‌మోజీ టీమ్‌ వెండితెరపై వచ్చేందుకు సిద్ధమైంది. 
 

1 /5

ఫన్‌మోజీ సుశాంత్ మహాన్ హీరోగా పరిచయం కానున్నాడు. మన్వంతర మోషన్ పిక్చర్స్, శివం సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై కె.సుధాకర రెడ్డి, రవి SM1 మూవీని నిర్మిస్తున్నారు.  

2 /5

తాజాగా హీరో సుశాంత్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్‌తో మూవీ కాన్సెప్ట్‌పై క్లారిటీ ఇచ్చారు.  

3 /5

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సినిమాను రూపొందిస్తున్నట్లు అర్థమవుతోంది. అడ్వెంచరస్ మూవీని రూపొందిస్తున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు.  

4 /5

హీరో లుక్ విషయానికి వస్తే.. రగ్డ్ లుక్, ఏదో సుడిగుండంలో చిక్కుకున్నట్లుగా చూపించారు.  

5 /5

ఫస్ట్ లుక్‌తోనే ఆడియన్స్‌లో ఓ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ రానున్నాయి.