Allu Arjun: పుష్పరాజ్‌కు బిగ్ షాక్.. మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు..

Sandhya theatre stampede case: సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే పోలీసులు 18 మందిపై కేసుల్ని నమోదు చేసినట్లు తెలుస్తొంది. తాజాగా, పోలీసులు.. అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు జారీ చేశారు.
 

1 /5

అల్లు అర్జున్ కు చిక్కడ పల్లి పోలీసులు మరో బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తొంది. పుష్ప2 మూవీ ప్రీమియర్ షో నేపథ్యంలో రేవతి అనే మహిళ తొక్కిసలాటలో చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  

2 /5

ఈ నేపథ్యంలో ఈ ఘటనలోఅరెస్ట్ అయిన అల్లు అర్జున్ కోర్ట్ వారు ఇచ్చిన మధ్యంత బెయిల్ మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి చిక్కడ పల్లి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది.  

3 /5

రేపు ఉదయం అంటే.. మంగళవారం.. ఉదయం 11 గంటలకు తమ ముందు హజరు కావాల్సిందిగా పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది.  

4 /5

ప్రస్తుతం ఈ అంశం మాత్రం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పుష్ప2 గురించి మాట్లాడటంతో ఇది కాస్త పోలిటికల్ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తొంది.  

5 /5

 కొన్ని పార్టీలు అల్లు అర్జున్ కు అండగా ఉండగా.. మరికొన్ని పార్టీలు మాత్రం అల్లు అర్జున్ తీరును తప్పుపడుతున్నాయి. అదే విధంగా అల్లు అర్జున్ ఆగమేఘాల మీద సీఎం రేవంత్ మాట్లాడగానే మీడియా సమావేశం నిర్వహించడం కూడా కాంట్రవర్సీగా మారిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసులు.. బెయిల్ రద్దుకై హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేయనున్నట్లు తెలుస్తొంది.