Cold Waves Alert in Telangana: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కీలక అప్డేట్ ఇచ్చింది ఐఎండీ. రేపు ఎల్లుండి రెండు రోజులు చలి తీవ్రత మరింత పెరగనుంది. ముఖ్యంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రెండు రోజులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పలు జిల్లాల్లో కేవలం సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదు కావడంతో ఈ కీలక సూచనలు చేసింది వాతావరణ శాఖ.
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. పెరుగుతున్న చలి తీవ్రత నేపథ్యంలో రెండు రోజులపాటు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో కేవలం సింగల్ డిజిట్ ఉష్ణోగ్రతలు. ఈ నేపథ్యంలో రెండు రోజులు చలి మరింత పెరుగుతుందని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంది. రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. సింగల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.. ఇక రానున్న రెండు రోజులపాటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం కూడా ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ముఖ్యంగా ఉదయం పూట పొగ మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇలా తెలుగు రాష్ట్రాలు రెండు రోజుల పాటు భిన్న వాతావరణం ఏర్పడుతుందని చెప్పింది.
మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది.. ఈ నేపథ్యంలో ఏపీలో కొన్ని జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటన చేసింది. ఈ ఉపరితల ఆవర్తనం వల్ల కోస్తాంధ్ర జిల్లాలో తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పింది.
ఇక తెలంగాణలో రెండు రోజులపాటు చలి తీవ్రత మరింత పెరుగుతున్న తరుణంలో చలి గాలులు కూడా వీయనున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు ఈ రెండు రోజులు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.