Game Changer Flop Reasons: రామ్ చరణ్ పై వంద కుట్రలు.. గేమ్ చేంజర్ ఫ్లాప్ కు కారణాలు ఇవే..!

Game Changer Flop Reasons:కర్ణుడి చావుకు ఎన్నో  కారణాలున్నట్టు.. సంక్రాంతి కానుకగా విడుదలైన  రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గేమ్ చేంజర్' సినిమా ఫ్లాప్ వెనుక వంద కుట్రలు దాగున్నాయి.. మూవీలో కంటెంట్ బాగున్నా.. స్క్రీన్ ప్లే లోపాలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో రావాల్సిన వసూళ్లు రాబట్టలేకపోయింది. సినిమా ఆడాల్సినన్ని రోజులు ఆడలేదు. ఇంతకీ రామ్ చరణ్ పై నిజంగానే కుట్ర జరిగిందా అనే విషయానికొస్తే..

1 /6

Game Changer Flop Reasons: 2025 సంక్రాంతి కానుకగా రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమా పొంగల్ పోటీలో సోదిలో లేకుండా విడుదలైన వారం రోజుల్లో థియేటర్స్ నుంచి వైదొలిగింది. ఈ సినిమా ఫ్లాప్ కు గల కారణాల విషయానికొస్తే..

2 /6

రాంచరణ్ గేమ్ చేంజర్ పరాజయం వెనుక వంద కారణాలున్నాయి. మూవీలో కథ బాగున్నా..కథనం 90ల నాటిది కావడం మైనస్ గా మారింది. దీంతో రావాల్సిన వసూళ్లు రాలేదు. పైగా శంకర్ లాజిక్ ను ఒదిలేసి సెకండాఫ్ ను ఇష్టమొచ్చినట్టు తెరకెక్కించడం కూడా ఈ సినిమాకు మైనస్ గా మారింది.

3 /6

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీపై జరిగిన కుట్రలేమిటనే విషయానికోసొస్తే.. గేమ్ చేంజర్ సినిమాపై అల్లు అర్జున్ అభిమానుల ఆగ్రహం ఓ కారణం అని చెప్పాలి. అంతేకాదు ప్రీమియర్ షో ముగిసిన గంటలోనే ఆన్ లైన్ HD ప్రింట్ ప్రత్యక్ష మవ్వడం ఈ సినిమా పరాజయానికి గల మరో కారణం.  

4 /6

RRRలో ఎన్టీఆర్ రోల్ తక్కువ చేశారనే కోపంలో జూనియర్  ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కసి రేగింది. మరోవైపు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ లో సగం కూడా రికవరీ చేయలేకపోయింది.

5 /6

రేవంత్‌కు దిల్ రాజు మద్దతుతో బీఆర్ఎస్ నేతలకు ఈ సినిమాను తొక్కేయాలనే అపుడే ఫిక్స్ అయ్యారు. మూవీకి ప్యాన్ ఇండియా హైప్ తీసుకురావడంలో విఫలమయ్యారు. పవన్ ప్రచారంతో వైసీపీ కేడర్  గేమ్ చేంజర్ కు దూరం అయ్యారు.

6 /6

మరోవైపు గేమ్ చేంజర్ కలెక్షన్లపై పుష్ప-2 తొక్కిసలాట ఘటన ఎఫెక్ట్ పడింది. రిలీజ్ ఒకరోజు ముందు మాత్రమే  బుక్ మై షోలో బుకింగ్స్ చేయడం వంటివి ఈ సినిమా ఫ్లాప్ కు కారణాలుగా నిలిచాయి.