Neha Shetty Saree Pics: రూటు మార్చిన 'డీజే టిల్లు' హీరోయిన్.. చీర కట్టులో కూడా..!!

DJ Tillu Heroine Neha Shetty Latest Saree Pics: ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్‌లో కనిపించే నేహా శెట్టి తాజాగా చీర కట్టులో కూడా ఆకట్టుకున్నారు. శివరాత్రి పండగ సందర్భంగా నేహా చీరలో దర్శనమిచ్చారు. 

  • Mar 02, 2022, 11:49 AM IST

DJ Tillu Heroine Neha Shetty Latest Saree Pics: స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాద్ తనయుడు ఆకాష్ హీరోగా తెరకెక్కిన 'మెహబూబా' సినిమాతో నేహా శెట్టి తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు. మెహబూబా సినిమా ఆశించినంత మేర ఆడలేదు. అయితే నేహాకు నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తన అందంతో కుర్రకారును ఆకట్టుకుంది. 

1 /4

ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్‌లో కనిపించే నేహా శెట్టి తాజాగా చీర కట్టులో కూడా ఆకట్టుకున్నారు. శివరాత్రి పండగ సందర్భంగా నేహా చీరలో దర్శనమిచ్చారు.   

2 /4

'డీజే టిల్లు' సినిమాలో నేహా శెట్టికి నటన పరంగా మంచి మార్కులే పడ్డాయి. సినిమాలో గ్లామర్ డోస్ పెంచి యువతను కూడా ఆకట్టుకున్నారు. 

3 /4

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం 'డీజే టిల్లు' ఫిబ్రవరి 12న థియేటర్లలో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నేహాకు మంచి బ్రేక్ ఇచ్చింది. 

4 /4

మెహబూబా సినిమా అనంతరం సందీప్ కిషన్‌తో కలిసి నేహా శెట్టి 'గల్లీ రౌడి' సినిమా చేశారు. ఆ సినిమా కూడా కమర్షియల్‌గా మంచి విజయం అందుకోలేదు.