Water Expiry Date: సకల చరాచర సృష్టిలో నీళ్లే మూలం. నీళ్లు లేకుంటే జీవరాశి మనుగడే లేదు. అయితే తాగే నీళ్లు ఎంతవరకూ సురక్షితమనేది తెలుసుకోవాలి. సీల్ చేసిన వాటర్ బాటిల్ డ్రై అండ్ కూల్ ప్లేస్‌లో ఉంచితే ఆ నీళ్లు సురక్షితమే. ఒకసారి బాటిల్ ఓపెన్ చేశాక మాత్రం ఎక్కువ కాలం ఉండదు. కుళాయి నీళ్లు తాగే అలవాటుంటే ఎంత శుభ్రంగా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇదంతా ఓ ఎత్తైతే నీళ్లకు ఎక్స్పైరీ ఉంటుందనే విషయం మీకు తెలుసా
శుద్ది చేసిన నీళ్లు ఎప్పటికీ బెస్ట్ సాధారణ, సానుకూల వాతావరణంలో నీళ్లు ఎప్పటికీ పాడవవు. ఎలాంటి బ్యాక్టీరియా జన్మించదు. శుద్ధి చేసిన నీళ్లు ఎప్పుడైనా తాగవచ్చు.
బాటిల్ ఎక్స్పైరీ తేదీ బాటిల్ నీళ్లు తాగే అలవాటుంటే ఎక్స్పైరీ తేదీ చెక్ చేసుకోవాలి. బాటిల్ సరిగ్గా ఉందా లేదా, ఎదైనా డ్యామేజ్ ఉందా అనేది పరిశీలించుకోవాలి.
బాటిల్స్‌లో మైక్రోప్లాస్టిక్ ముప్పు కాలం గడిచేకొద్దీ వాటర్ బాటిల్స్‌లో మైక్రోప్లాస్టిక్స్ వెలువడతాయి. ప్లాస్టిక్ బలహీనమౌతుంది. అందుకే బాటిల్ వినియోగం కొద్దికాలమే చేయాలి. నీళ్లలో వ్యర్ధాలు ఏమైనా ఉంటే అప్పుడు మాత్రం నీళ్ళు పాడవుతాయి. కానీ పరిశుభ్రమైన నీళ్లు ఎప్పుడూ బాగుంటాయి. అంటే నీటికి ఎక్స్పైరీ ఎప్పుడూ ఉండదు
నీళ్లు ఎప్పటికీ పాడవవా నీళ్లు ఎప్పటికీ ఎక్స్పైర్ అవవు. కేవలం పాడవుతాయంతే. వాటిని మళ్లీ శుభ్రపరుస్తారు. వాటర్ బాటిల్‌పై ఉండే ఎక్స్పైరీ తేదీ అనేది వాస్తవానికి నీళ్లకు కాదు. బాటిల్ ఎక్స్పైరీ అది. వాటర్ బాటిల్ ప్లాస్టిక్‌తో తయారవుతుంది. ఆ ప్లాస్టిక్ ఎక్స్పైరీ తేదీ అది.
నీళ్లకు ఎక్స్పైరీ ఉండదా అందుకే నీళ్ల విషయంలో చాలా కాలంగా డిబేట్ నడుస్తూనే ఉంది. వాటర్ బాటిల్స్‌పై ఎక్స్పైరీ తేదీ ఎందుకు ఉంటుందని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. వాస్తవానికి నీళ్లకు ఎక్స్పైరీ తేదీ ఉండదు. చాలా ప్రక్రియలతో నీటిని పూర్తిగా శుద్ధి చేస్తారు.
నీళ్లు పాడవుతాయా ఒకవేళ నీళ్లకు ఎక్స్పైరీ ఉంటే అది ఎన్ని రోజులకు ఉంటుంది. ఎక్స్పైరీ ఉండదనుకుంటే ఎందుకుండదనేది తెలుసుకోవాలి. మార్కెట్లో అయితే దాదాపు అన్ని ప్రాంతాల్లో వాటర్ బాటిల్ రూపంలో లభిస్తోంది. ఊర్ల నుంచి నగరాల వరకూ ఎక్కడ చూసినా వాటర్ బాటిల్స్ కన్పిస్తుంటాయి. వాటర్ బాటిల్‌పై ఎక్స్పైరీ తేదీ కూడా ఉంటుంది.
వాటర్ ఎక్స్పైరీ డేట్ నీళ్లకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా అని చాలా మంది అనుకుంటారు. నీటి విషయంలో ప్రపంచవ్యాప్తంగా చాలా అంశాలు ఉన్నాయి. కొన్ని శాస్త్రీయంగా నిజమైతే కొన్నింటికి అంచనాలు ఉంటాయి. ఇంతకీ నీళ్లకు ఎక్స్పైరీ ఉంటుందా లేదా