Fertility Tips: పిల్లలు పుట్టాలంటే పురుషులు ఇవి చేయొద్దు.. చేస్తే మాత్రం చాలా డేంజర్

Fertility Mens Must To Avoid These Foods: మారిన కాలమాన పరిస్థితులు.. తీసుకునే ఆహారంతో ఇప్పుడు వివాహమైన ప్రతి జంట ఎదుర్కొంటున్న సమస్య సంతానోత్పత్తి కలగకపోవడం. మహిళలతోపాటు పురుషుల్లో కూడా సమస్యల కారణంగా సంతానోత్పత్తి కలగదు. పురుషులు కొన్ని ఆహారాల నుంచి దూరంగా ఉండాల్సి ఉంది. వీటికి దూరంగా ఉంటే సంతానోత్పత్తి కలుగుతుంది.

1 /10

ఆహారం ముఖ్యం: గర్భధారణలో దంపతుల ఆహారం చాలా ముఖ్యం. గర్భం దాల్చే ప్రయత్నం చేసేప్పుడు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. నిజానికి పురుషులు కూడా గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆహారంపై శ్రద్ధ వహించాలి.

2 /10

స్పెర్మ్‌ సంఖ్య: పురుషుల్లో స్పెర్మ్ సంఖ్య చాలా తక్కువగా ఉండడం సంతానోత్పత్తి కలగకపోవడానికి కారణంగా నిలుస్తోంది. స్పెర్మ్‌ సంఖ్య పెరగడం కోసం పురుషులు కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు.

3 /10

ఆహారంలో మార్పులు: సంతానోత్పత్తి కోసం ఎదురుచూస్తున్న పురుషులు ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఆహారాలు స్పెర్మ్ నాణ్యత, ఉత్పత్తిని తగ్గిస్తుంటాయి. గర్భం దాల్చే అవకాశాలను దూరం చేస్తుంటాయి.

4 /10

ప్రాసెస్డ్‌ ఆహారం: ప్రాసెస్ చేసిన ఆహారాలు, మాంసంలో అధిక స్థాయిలో ట్రాన్స్‌ఫ్యాట్స్, ప్రిజర్వేటివ్‌, అధిక సోడియం ఉన్న వాటిని తినకూడదు. ఇవి స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీస్తాయి. ఫాస్ట్‌ ఫుడ్స్‌తో ఉబ్బరం, తక్కువ స్పెర్మ్ ఏకాగ్రత, బలహీనమైన చలనశీలతకు దారితీస్తుంది. ఎరుపు మరియు ప్రాసెస్ చేసిన మాంసాలను తరచుగా తీసుకోవడం వల్ల స్పెర్మ్ ఉత్పత్తికి హాని కలుగుతుంది.

5 /10

పాల ఉత్పత్తులు: కొవ్వు పాల ఉత్పత్తులు, కొన్ని చీజ్‌లు టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తాయి. అధిక స్థాయి కొవ్వు హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఇది స్పెర్మ్ కౌంట్, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.

6 /10

చేపలు: స్వోర్డ్ ఫిష్, ట్యూనా వంటి చేపలలో కొన్ని సంతానోత్పత్తిని దెబ్బతీసే పోషకాలు ఉంటాయి. ఇవి స్పెర్మ్ డీఎన్‌ఏను దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. స్పెర్మ్ చలనం లేకపోవడం, వాటి సంఖ్యను తగ్గించేలా చేస్తాయి. అందుకే వాటికి దూరంగా ఉండాలి.

7 /10

మద్యపానం: మద్యపానం స్పెర్మ్‌ ఉత్పత్తిని తగ్గిస్తుంది. స్పెర్మ్ సంఖ్యను పూర్తిగా తగ్గించి సంతానం కలగకుండా నష్టం ఏర్పరుస్తుంది. పరిమితంగా మద్యం తీసుకోవచ్చు. కానీ అధిక మోతాదులో మద్యం తీసుకోవడం మాత్రం తగ్గించాల్సి ఉంటుంది. సంతానోత్పత్తికే కాదు ఆరోగ్యానికి కూడా మద్యం హానికరం.

8 /10

సోయా ఉత్పత్తులు: సోయాలో ఐసోఫ్లేవోన్స్ అనేది ఉంటుంది. సోయా ఉత్పత్తులను అధికంగా తీసుకోవడంతో పురుషులలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతీస్తుంది. దీని ద్వారా స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గుతుంది. ఇది సంతానోత్పత్తిని ప్రభావం చూపుతుంది.

9 /10

కాఫీ, ఎనర్జీ డ్రింక్స్‌: కెఫీన్, ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. స్పెర్మ్ డీఎన్‌ఏపై ప్రభావం చూపుతుంది. సంతానోత్పత్తికి ప్రయత్నం చేసేవాల్లు కెఫిన్ వినియోగం రోజుకు 200 గ్రాముల కంటే తక్కువగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పురుషులు కాఫీ, కెఫిన్ ఉండే పానీయాలను తగ్గించుకుంటే సంతానోత్పత్తి కలిగే అవకాశం ఉంది. సంతానోత్పత్తి సమస్యలను పెంచుతుంది.

10 /10

గమనిక: ఈ అంశం సాధారణ సమాచారం అందించడానికి మాత్రమే. దీనిని జీ న్యూస్‌ ధ్రువీకరించడం లేదు. వీటిని పాటించేముందు వైద్య నిపుణుల సలహా పొందాలి.