Friendship day 2024: స్నేహానికి ఎక్స్ పైరీ డేట్ లేదు. అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా స్నేహానికి కూడా ఎలాంటి గడువు లేదు. ఒకప్పటి టాకీలు మొదలైనప్పటి నుంచి కలర్.. డిజిటల్ వరకు ఇప్పటికీ తెలుగులో స్నేహంపై ఎన్నో అద్భుత చిత్రాలు వచ్చాయి. అందులో టాలీవుడ్ ప్రస్తుత సీనియర్ టాప్ హీరోలు చేసిన ఫ్రెండ్ షిప్ డే మూవీస్ పై ఓ లుక్కేద్దాం.
స్నేహం కోసం: చిరంజీవి, విజయ్ హీరోలుగా కే.యస్.రవికుమార్ తెరకెక్కించిన ఈ సినిమా స్నేహం విలువను చాటి చెప్పింది.
స్నేహమంటే ఇదేరా: నాగార్జున, సుమంత్ హీరోలుగా తెరకెక్కిన ‘స్నేహమంటే ఇదేరా’. ఈ చిత్రం స్నేహాం విలువను చాటి చెప్పింది.
పెళ్లి పందిరి: జగపతి బాబు, పృథ్వీ స్నేహితులుగా తెరకెక్కిన సినిమా ‘పెళ్లి పందిరి’. ఈ సినిమా ఫ్రెండ్ షిప్ కు కొత్త అర్ధాన్ని చెప్పింది.
వసంతం: స్నేహం అంటే కేవలం ఆడ, మగ వాళ్ల మధ్య కాదు.. ఆడ, మగ మధ్య స్నేహం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘వసంతం’. ఈ సినిమా స్నేహ బంధాన్ని గొప్పగా ఆవిష్కరించింది.
ప్రాణానికి ప్రాణం: నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘ప్రాణానికి ప్రాణం’. ఫ్రెండ్ షిప్ కు కొత్త అర్ధం చెప్పిన చిత్రాల్లో ఇది ఒకటి.
కొండపల్లి రాజా: స్నేహానికి కొత్త అర్ధం చెప్పిన చిత్రాల్లో వెంకటేష్, సుమన్ హీరోలుగా తెరకెక్కిన ‘కొండపల్లి రాజా’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయమే సాధించింది.