Game Changer: గేమ్ ఛేంజర్‌తో ఫైనల్‌గా మిగిలిన నష్టం ఎంతో తెలుసా..!

Game Changer Collections : గేమ్ చేంజెడ్ సినిమా రామ్ చరణ్ కెరియర్లోనే.. మరో డిజాస్టర్ గా మిగలనుండి. ఇక ఈ సినిమా చివరిగా మిగిల్చే నష్టం ఎంత అనే దానిపై ఒక క్లారిటీ కూడా వచ్చేసింది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ఎన్నో థియేటర్స్ నుంచి ఎత్తేశారు. ఈ క్రమంలో ఈ చిత్రం ఎంత సంపాదించింది.. ఎంత నష్టం మిగిల్చింది అనే విషయం చూద్దాం.
 

1 /5

మెగా పవర్ స్టార్ నటించిన గేమ్ చేంజెర్ చిత్రం.. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ, విడుదలైన తర్వాత ఘోర పరాజయం చవిచూసింది. ఈ సినిమా నెగిటివ్ టాక్‌ను మాత్రమే అందుకుంది. దానికి కారణం సినిమాకు సంబంధించిన కధ, కథనం.

2 /5

'గేమ్ ఛేంజర్' సినిమాలో కథ, కథనం అన్నీ ఆశించిన స్థాయిలో ఉండకుండా పోయాయి.  మెగా అభిమానులు కూడా ఈ సినిమాను చాలా విమర్శించారు. సరైన కథ లేకపోవడం ఈ సినిమాకు పెద్ద నష్టమని.. మెగా అభిమానులు సైతం ఒప్పుకోక తప్పలేదు.   

3 /5

ఈ సినిమాకు దర్శకత్వం వహించిన శంకర్, పొలిటికల్ జానర్‌లో మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ, ఈ సినిమాని ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో సినీ ప్రేక్షకులతో పాటు మెగా అభిమానులు ఈ దర్శకుడిని తీవ్రంగా విమర్శించారు. 

4 /5

మొత్తంగా 'గేమ్ ఛేంజర్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన కలెక్షన్ సాధించలేకపోయింది. 18 రోజుల్లో ఈ సినిమాకు రూ. 130.01 కోట్లు వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 18వ రోజు మాత్రమే రూ. 41 లక్షలు వసూలు అయ్యాయి. బడ్జెట్ పరంగా ఈ సినిమా రూ. 450 కోట్లతో నిర్మించబడింది, కానీ వసూళ్లు మాత్రం అసలు రాకపోవడంతో ఈ చిత్రం ఎక్కువ నష్టాలను తెచ్చిపెట్టబోతోంది అన్న క్లారిటీ అందరికీ వచ్చేసింది. ఈ సినిమా ఏకంగా 250 కోట్లకు పైగా నష్టాన్ని మిగిల్చ నుండి అని వినికిడి.

5 /5

ఇక ఇంటర్నష్టాన్ని మిగిల్చిన..గేమ్ ఛేంజర్ OTT వేదికపై విడుదలకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి రెండవ వారంలో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యే అవకాశం ఉన్న ఈ సినిమాకు OTT లో ఎలాంటి ఆదరణ దక్కుతుందో వేచి చూడాలి.