DRDO Careers 2025 Full Details Here: కేంద్ర ప్రభుత్వ సంస్థలు మంచి ఉద్యోగం పొందాలనుకుంటున్నారా.. నిరుద్యోగ యువతకు ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు వెల్లడించింది.
DRDO Careers 2025 Full Details Here: కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ తెలిపింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) నుంచి ప్రత్యేకమైన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే పోస్టులకు భర్తీ నోటిఫికేషన్ను విడుదల చేసినట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) జాబ్ నోటిఫికేషన్ లో భాగంగా ఖాళీల వివరాలను, జాబ్ అప్లికేషన్ పద్ధతిని క్లుప్తంగా అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. అంతేకాకుండా ఈ దరఖాస్తుకు సంబంధించిన అర్హతలను కూడా తెలిపినట్లు సమాచారం.
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ భర్తీ చేసే పోస్టుల్లో భాగంగా మొత్తం 25 ఖాళీ ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను ఫిల్ చేయబోతున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగానే ఈ జాబ్ అప్లికేషన్ పెట్టుకునే వారికి కొన్ని విద్యా అర్హతలను కూడా సూచించింది. s
ముందుగా ఈ జాబ్ ని అప్లై చేసుకునేవారు తప్పకుండా కొన్ని విద్యా అర్హతలను కలిగి ఉండాలని జాబ్ నోటిఫికేషన్ లో కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీనిని అప్లై చేసుకునే వారు JRF సంబంధించిన విభాగంలో తప్పకుండా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా 2023 నుంచి 24 వరకు ఏ సంవత్సరంలోనైనా గేట్ స్కోర్ కలిగి ఉండాలని తెలిపింది.
అలాగే JRF పోస్టులకు సంబంధిత విభాగంలో ఎంటెక్ లేదా ఎమ్ ఈ పూర్తి చేసి ఉండాలని తెలిపింది. ఈ నోటిఫికేషన్ లో గరిష్ట వయస్సు పరిమితిని కూడా పేర్కొంది. ఈ జాబ్ అప్లై చేసుకునేవారు 28 సంవత్సరాలలోపే ఉండాలని తెలిపింది. అలాగే ఈ జాబ్ కి ఎంపిక చేసుకునే వారిని రాత పరీక్ష ద్వారా వారి సామర్థ్యాన్ని తెలుసుకొని ఎంపిక చేసుకోబోతున్నట్లు తెలిపింది.
ముందుగా ఈ నోటిఫికేషన్ లో భాగంగా రాత పరీక్షను నిర్వహించి.. ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయనున్నారు. ఇందులో ఎంపికైన వారికి మొదటగా నెలకు రూ.37,000/- స్టైఫండ్ ఇవ్వబోతున్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించారు. అయితే ఈ జాబ్ ని అప్లై చేసుకునే వారు నేరుగా jrf.rectt.cabs@gov.in అనే వెబ్సైట్ లింక్ నుంచి అప్లై చేసుకోవచ్చు..