India Women Beat New Zealand Women By 6 Wickets: ప్రపంచకప్‌లో ఓటమిపాలైన భారత మహిళల జట్టు న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ను మాత్రం చేజిక్కించుకున్నారు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించి 2-1తో న్యూజిలాండ్ నుంచి సిరీస్‌ను లాగేసుకున్నారు. స్మృతి మంధాన అద్భుత సెంచరీతో దుమ్మురేపింది.
సిరీస్ సొంతం: ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన చేసిన భారత మహిళల జట్టు న్యూజిల్యాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఆడింది.
కీలక మ్యాచ్: అహ్మదాబాద్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను చేజిక్కించుకుంది.
ప్రత్యర్థి ఆలౌట్: మొదట బ్యాటింగ్ ఆడిన న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 232 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
సులువుగా: భారత మహిళలు 44.2 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి అతి సునాయాసంగా 233 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
స్మృతి తడాఖా: స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మరోసారి బ్యాట్‌తో దుమ్మురేపింది. 122 బంతుల్లో శతకం సాధించగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అర్థ శతకంతో సత్తా చాటింది.
గత మ్యాచ్ లు ఇలా: మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ 59 పరుగుల తేడాతో విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 76 రన్స్‌తో గెలుపొందడం విశేషం.
అద్భుతం: ఆఖరి మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతం చేసింది. సమష్టి కృషితో 34 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను సొంతం చేసుకోవడం విశేషం.
అప్పుడు నిరాశ: సొంత గడ్డపై విజయం సాధించిన భారత మహిళలు ప్రపంచకప్‌లో మాత్రం సత్తా చాటకపోవడం క్రికెట్ అభిమానులను నిరాశపర్చే అంశంగా మిగిలింది.