IPL 2023 Stars: ఐపీఎల్ ఎందరో ప్లేయర్లకు జీవితాన్ని ఇచ్చింది. ఒక్క ఇన్నింగ్స్‌తో రాత్రికి రాత్రే సూపర్ స్టార్లుగా మార్చింది. ప్రతి సీజన్‌లో ఒకరిద్దరు ప్లేయర్లు తమ సత్తా నిరూపించుకుని టీమిండియా తలుపు తడుతున్నారు. ఈ సీజన్‌లో కూడా కొంతమంది యంగ్ ప్లేయర్లు తమ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. వారిపై ఓ లుక్కేయండి.
కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ సృష్టించిన విధ్వంసం ఐపీఎల్ చరిత్రలో ఎన్నటికీ మరువలేనిది. ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై విజయానికి చివరి ఓవర్‌లో 29 పరుగులు అవసరమైన దశలో.. వరుసగా 5 సిక్సర్లు కొట్టి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. రింకూ సింగ్ ఇలానే ఆడితే ఫినిషర్‌గా టీమిండియా తలుపు తట్టే అవకాశం ఉంది. (ఫోటో:BCCI/IPL)
కోల్‌కతా నైట్ రైడర్స్ లెగ్ స్పిన్నర్ సుయాష్ శర్మ అరంగేట్ర మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. 19 ఏళ్ల సుయాష్.. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంట్రీ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఒక్క ఫస్ట్ క్లాస్ గేమ్ కూడా ఆడకుండానే తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో సూపర్‌గా బౌలింగ్ చేశాడు. (ఫోటో: BCCI/IPL)
గుజరాత్ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ ఈ సీజన్‌లో వెలుగులోకి వచ్చిన మరో ఆణిముత్యం. 21 ఏళ్లలోనే తన బ్యాట్‌తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ తరపున అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. సుదర్శన్ ఇప్పటికే 3 మ్యాచ్‌లలో 137 పరుగులు చేశాడు. (ఫోటో: BCCI/IPL)
ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ ఐపీఎల్ 2023ను అద్భుతంగా ప్రారంభించాడు. మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అజేయంగా 84 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. 20 ఏళ్ల తిలక్ వర్మ హైదరాబాద్ తరపున 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ముంబై ఇండియన్స్‌కు కీలక బ్యాట్స్‌మెన్‌గా మారిపోయాడు. (ఫోటో: BCCI/IPL)
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ అవతలి ఎండ్‌లో ఉన్నా.. వేగంగా పరుగులు చేస్తూ బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు. జైస్వాల్ 3 మ్యాచ్‌లలో 2 అర్ధశతకాలు బాది.. 164.47 స్ట్రైక్ రేట్‌తో 125 రన్స్ చేశాడు. (ఫోటో: BCCI/IPL)