Today Gold Rate: దేశంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. త్వరలోనే లక్ష దాటుతుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. దీనికి కారణం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులే అని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. బంగారానికి ఇరాన్ -ఇజ్రాయెల్ యుద్ధానికి మధ్య సంబంధం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gold Rate: బంగారం ధర ఏ రోజుకు ఆ రోజు సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. నిజానికి పసిడి ధరలు చరిత్రలోనే తొలిసారిగా 78,000 రూపాయల మార్కును దాటి 80,000 రూపాయల దిశగా పరుగు పెడుతున్నాయి. ఈనెల అక్టోబర్ మూడవ తేదీన బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయి అయిన 78,500 రూపాయలను తాకింది. పసిడి ధర పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఒక కారణంగా చెప్పవచ్చు.
ప్రస్తుతం ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా బంగారం ధర ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. చరిత్రలో కనివిని ఎరుగని విధంగా, బంగారం ధర ఏకంగా 80 వేల రూపాయల దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికి ఆల్ టైం రికార్డ్ స్థాయిని స్థాపించింది. గతంలో బంగారం 75 వేల రూపాయలు ఆల్ టైం రికార్డు ఉండేది. ఆ రికార్డులను జరిపి వేస్తూ బంగారం ధర 78,000 స్థాయికి చేరింది.
అయితే త్వరలోనే బంగారం ధర ఈ ఏడాది చివరి నాటికి కనీసం లక్ష రూపాయలకు చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే చాలామందికి సందేహం కలగవచ్చు ఎక్కడో ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతుంటే మనదేశంలో ఎందుకు బంగారం ధర పెరుగుతుంది అని సందేహం కలిగే అవకాశం ఉంది. దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కారణంగా బంగారం ధర భారీగా పెరుగుతుంది. నిజానికి బంగారం ధరలు నిర్ణయించేవి దేశీయ పరిస్థితుల కన్నా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగానే అవి ప్రతిరోజు ధర మారుతూ ఉంటాయి. ప్రధానంగా అమెరికా ఆర్థిక పరిస్థితి, ఆసియా, యూరప్ స్టాక్ మార్కెట్లలో కదలికలపైనే బంగారం ధర ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
ఎప్పుడైతే యుద్ధ పరిస్థితులు ఏర్పడతాయో అప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. ఎందుకంటే పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లు పతనమైనప్పుడు తమ పెట్టుబడులను నెమ్మదిగా బంగారం వైపు తరలిస్తారు. ఎందుకంటే బంగారం అత్యంత సురక్షితమైన పెట్టుబడి. ఆర్థికంగా ఎలాంటి సంక్షోభ పరిస్థితులు తలెత్తిన ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారంపై తరలిస్తారు. ఈ కారణంగా బంగారం ధర భారీగా పెరుగుతుంది.
ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం సందర్భంగా ప్రపంచ వాణిజ్యం దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతి దారులైన భారత్ చైనా లకు ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. అయితే ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ రవాణా అనేది క్లిష్టంగా మారుతుంది.
క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా ప్రపంచ వాణిజ్యం సైతం దెబ్బతింటుంది. ఫలితంగా స్టాక్ మార్కెట్లలో నష్టాలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఈ నష్టాల నుంచి రికవరీ అయ్యేందుకు ఇన్వెస్టర్లు తమ సేపెస్ట్ పెట్టుబడిగా బంగారంపై ఇన్వెస్ట్ చేస్తారు. ఈ కారణంగానే బంగారం ధర పెరుగుతుంది.