Janhvi Kapoor: పండగ వేళ చీరకట్టులో చూపు తిప్పుకోలేకుండా చేస్తోన్న జాన్వీ కపూర్..


Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించి ఆమె కంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ యేడాది జాన్వీ కపూర్ కు స్పెషల్ అని చెప్పాలి. దసరా సందర్బంగా విడుదలైన ‘దేవర’ దీపావళి వరకు మంచి కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి.

 

1 /6

జార్వీ కపూర్ కు ఇన్నేళ్లు ఏ బాలీవుడ్ సినిమాతో రాని నేమ్ అండ్ ఫేమ్.. ఎన్టీఆర్ తో చేసిన ‘దేవర’తో వచ్చింది. ఈ మూవీలో  హీరోయిన్ కు తక్కువ.. అతిథి పాత్రకు ఎక్కువగా అన్నట్టు ఉన్నా.. తొలిసారి తన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడింది. అందుకే ఇపుడు వరుసగా తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెడుతోంది.  

2 /6

  ‘దేవర పార్ట్ -1’లో జాన్వీ పాత్ర కొద్ది సేపు ఉన్న.. రాబోయే ‘దేవర పార్ట్ -2’లో జాన్వీ పాత్రకు మంచి గుర్తింపు ఉంటుందని చెబుతున్నారు. దాంతో  రామ్ చరణ్ తో చేస్తోన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ తో తెలుగులో జెండా పాతాలనే కృత నిశ్చయంతో ఉంది.

3 /6

  మరోవైపు నాగ చైతన్యతో ఓ సినిమా చేయడానికి జాన్వీ కపూర్ ఓకే చెప్పినట్టు సమచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.

4 /6

  జాన్వీ కపూర్. ఫస్ట్ సినిమా 'ధడక్‌'. ఈ సినిమాలో మరాఠిలో హిట్టైన ‘సైరత్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది.  ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది.  కానీ ఆ త‌ర్వాత జాన్వీ యాక్ట్ చేసిన  సినిమాలు ఎక్కువ మటుకు  ఓటీటీ వేదిక‌గానే విడుదలయ్యాయి.

5 /6

జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో  అడుగుపెట్టి  దాదాపు ఆరేళ్లు పూర్తి కావొచ్చింది.తాజాగా ‘దేవర’ బ్లాక్ బస్టర్ అయినా.. ఆ క్రెడిట్ మొత్తం ఎన్టీఆర్ కే పోయింది. దర్శకుడిగా కొరటాలకు కూడా ఏమి దక్కలేదనే చెప్పాలి. ఈ సినిమాలో జాన్వీ నటించానన్న సంతృప్తి తప్పితే పెద్దగా ప్రయోజనం ఏమి లేదనే చెప్పాలి. 

6 /6

జాన్వీ కపూర్.. తల్లి శ్రీదేవి బాటలో తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ కావాలని తెలుగు చిత్ర సీమను నమ్మకుంది. అందుకు  దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సినిమా తెలుగు,హిందీ,కన్నడ మూడు భాషల్లో మంచి  సక్సెస్ అందుకోవడం విశేషం. అంతేకాదు తల్లి కోరుకున్నట్టుగానే సౌత్ సినిమాలతో బాలీవుడ్ లో పాగా వేస్తోంది.