Jio: చవక.. చవక.. జియో రూ.189 రీఛార్జీ ప్యాక్‌ దిమ్మదిరిగే వాల్యూ ప్లాన్‌..

Reliance Jio Reintroduced Plan: జియో ఇటీవలె ట్రయ్‌ ఆదేశాల మేరకు వాయిస్‌ ప్లాన్స్‌పై ధరలు తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రైవేట్‌ దిగ్గజ టెలికాం కంపెనీ అతి తక్కువ ధరలోనే వాయిస్‌ ప్లాన్స్‌ అందిస్తుంది. తాజాగా మరో ప్లాన్‌ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.189 తో అపరిమిత వాయిస్‌ కాలింగ్‌తోపాటు ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితంగా పొందుతారు. ఈ ప్లాన్‌ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

రిలయన్స్‌ జియో రూ.189 ప్లాన్‌ ప్రీపెయిడ్‌ కస్టమర్లకు బంపర్‌ బెనిఫిట్స్‌ అందుతాయి. ఈ ప్లాన్‌ బడ్జెట్‌ ఫ్రెండ్లీ. ఈ ప్లాన్‌ గతంలో అందుబాటులో ఉండే. కొన్ని కారణాల వల్ల ఈ ప్లాన్‌ నిలిపివేశారు. తాజాగా జియో మరోసారి ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.  

2 /5

జియో అందిస్తున్న ఈ ప్లాన్‌ కేవలం రూ.189 కే అందుబాటులో ఉంది. దీన్ని వ్యాలిడిటీ 28 రోజులపాటు వర్తిస్తుంది. ఇందులో మీరు ఉచితంగా 300 ఎస్ఎంఎస్‌లతోపాటు అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, 2 జీబీ డేటా 64 కేబీపీఎస్‌ స్పీడ్‌ పొందుతారు.   

3 /5

అంతేకాదు జియో వినియోగదారులు ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ సబ్‌స్క్రీప్షన్‌ కూడా ఉచితంగా కంప్లీమెంటరీ యాక్సెస్‌  పొందుతారు.  

4 /5

ఈ ప్లాన్‌తోపాటు రూ.199 రీఛార్జీ ప్లాన్‌ కూడా అందుబాటులో ఉంది. ఇందులో మీరు 18 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. కానీ, ఈ ప్యాక్‌లో మీరు ప్రతిరోజూ 1.5 జీబీ డేటా పొందుతారు. అంతేకాదు 100 ఎస్‌ఎంఎస్‌లు వ్యాలిడిటీ మొత్తం పొందుతారు.  

5 /5

జియో రూ.458 వాయిస్‌ ప్లాన్‌  కూడా ఉంది. దీని వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది. మరిన్ని ప్లాన్స్‌ కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ముఖ్యంగా వాయిస్‌ ప్లాన్స్‌ డేటా వినియోగించలేని వారికి అతిగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు..