Jr NTR 9999 Car Number : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కో హీరో ఒక్కో రకమైన సెంటిమెంట్ ఉంటుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్‌కు కార్లంటే మక్కువ ఎక్కువ. మార్కెట్లో కొత్త రకం కారు ఏది వచ్చినా.. ఆయన గ్యారేజ్‌లో ఉండాల్సిందే. అప్పట్లో రూ. 5 కోట్లకు పైగా ఖర్చు చేసి 'లంబోర్ఘిని' బ్రాండ్ కారును విదేశాలను దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఇక తారక్ అన్ని కార్లకు 9999 నంబర్ ఉండటం వెనక పెద్ద రీజనే ఉంది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో కార్లంటే ఎక్కువ మోజున్న హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. మార్కెట్లో కొత్త కారు ఏదొచ్చినా.. తారక్ కాంపౌండ్‌లో ఉండాల్సిందే. ఇక జూనియర్ దగ్గర ఉన్న అన్ని కార్లకు 9999 అనే ఒకే నంబర్ ఉంటుంది.
దీని వెనక బలమైన సెంటిమెంట్ ఉంది. సినీ ఇండస్ట్రీలో తుమ్మినా.. దగ్గినా అన్నింటికీ సెంటిమెంట్‌గానే చూస్తుంటారు. ఇండస్ట్రీలో ఏదైనా కలిసొచ్చిందంటే దాన్ని అసలు విడిచిపెట్టారు. సినిమాల విషయంలో కానీ.. వ్యక్తిగత విషయాల్లో కలిసొచ్చిన అంశాలనే ఎక్కువగా ఫాలో అవుతుంటారు మన స్టార్స్. అందుకు ఎన్టీఆర్ మినహాయింపు కాదు.
ఇలాంటి కలిసొచ్చే సెంటిమెంట్స్ ఫాలో అయ్యేవారిలో జూనియర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు. ఈయన దగ్గర ఉన్న అన్ని కార్లకు కామన్‌గా 9999 నెంబర్ ఉంటుంది. కొత్త కారు ఏది కొన్నా.. 9999 నంబర్ ఉండాల్సిందే. అయితే కార్స్ నంబర్స్ విషయంలో తనకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవని చెబుతుంటాడు యంగ్ టైగర్. కానీ ఆ నంబర్ని మాత్రం విడిచిపెట్టడం లేదు.
తన కార్లకు 9999 నెంబర్ వెనక పెద్ద కథే ఉందని చెప్పారు. తనకు 9 లక్కీ నంబర్ అని చెప్పుకొచ్చాడు. తన తాత స్వర్గీయ ఎన్టీఆర్ కారు నంబర్ 9999 అని.. ఆ తర్వాత తన తండ్రి హరికృష్ణ అదే నంబర్‌కు స్టిక్ ఆన్ అయ్యారని చెప్పుకొచ్చాడు.
ఆ సెంటిమెంట్ ప్రకారం తనకు 9999 అంటే ఇష్టమని చెప్పాడు. అందుకే కొత్త కారు ఏది కొన్నా.. రెండో ఆలోచన లేకుండా 9999 ఉండేలా చూసుకుంటాడు. అది కంటిన్యూ అవుతూనే ఉందని పలు సందర్భాల్లో ప్రస్తావిస్తాంచారు కూడా. రీసెంట్గా కొన్న కొత్త కారుకు కూడా ఎన్టీఆర్ అదే నంబర్ ఆర్టీఏ వేలంపాటలో 9999 నంబర్ తీసుకున్నాడు.
తనకు ఇష్టమైన వాళ్లు వాడిన నంబర్ కావడంతో తాను అదే 9999 నంబర్ కంటిన్యూ చేస్తున్నట్టు పలు సందర్భాల్లో ప్రస్తావించాడు. ఇక తారక్ ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ Xలో కూడా @tarak9999 అని ఉంటుంది. తాత, తండ్రి గుర్తుగా అదే నంబర్ వారసత్వంగా కంటిన్యూ చేస్తున్నాడు.
ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. మరోవైపు హృతిక్ రోషన్‌తో కలిసి 'వార్ 2' అనే భారీ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు. అటు ప్రశాంత్ నీల్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.