Tirumala: తిరుమల భక్తులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనం?

No Token s For Devotees In Tirumala తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కోసం నిత్యం వేల మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. అయితే, వీరికి మూడు నెలల ముందుగానే టోకెన్లు లేదా ప్రత్యేక కౌంటర్లలో టైమ్‌ స్లాటెడ్‌ టోకెన్స్‌ ఇస్తారు. వీరికి బంపర్‌ గుడ్‌ న్యూస్. మంగళవారం జరిగిన టీటీడీ సమావేశంలో  టోకెన్లు లేకుండా శ్రీవారి దర్శనాన్ని పరిశీలించనున్నారు.
 

1 /5

2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశుని ఉత్తర త్వార దర్శనం కల్పించారు. అయితే, ఇందులో టోకెన్లు లేని వారికి స్వామివారి దర్శన భాగ్యం కలుగ లేదు. అయితే మరుసటి రోజు నుంచి టోకెన్లు లేని భక్తులకు నేరుగా క్యూ కాంప్లెక్స్ లోకి అనుమతిస్తున్నారు.  

2 /5

రేపటి నుంచి ఏ రోజుకి ఆ రోజు సర్వదర్శనం టికెట్లు పునః ప్రారంభించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఇక వైకుంఠ ద్వార దర్శనం సమయంలో  మరికొంతమంది భక్తులకు  ఉత్తర ద్వారా దర్శనం లభించకపోవడంతో ఇప్పుడు తిరుమలకు దర్శనం చేసుకుంటున్నారు  

3 /5

జనవరి 8వ తేదీన ఉత్తర ద్వారా దర్శనానికి  టికెట్ల జారీ సమయంలో పెద్ద ఎత్తున భక్తులు క్యూ కట్టారు. ఆ సమయంలో తొక్కిసలాట జరిగి దాదాపు 7 మంది వరకు చనిపోయారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పలు సూచనలు తిరుమల తిరుపతి దేవస్థానానికి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.  

4 /5

 గతంలో మాదిరి శ్రీవారి భక్తులకు టోకెన్లు లేకుండానే సర్వదర్శనానికి అనుమతించేలా పరిశీలించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న మంగళవారం జరిగిన టీటీడీ సమావేశంలో సర్వదర్శనానికి నేరుగా అనుమతిస్తే ఇబ్బందులు ప్రయోజనాలు గురించి చర్చించినట్లు తెలుస్తోంది.  

5 /5

 అయితే దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ఒకవేళ ఇదే జరిగితే ఇంక గంటలకు సర్వదర్శనం టికెట్ల కోసం ఎదురు చూడాల్సిన పని ఉండదు,  టోకెన్ లేకుండానే నేరుగా శ్రీవారి దర్శనం లభిస్తుంది