KTR Vs Revanth Reddy: గుర్తు పెట్టుకో మిస్టర్ చీఫ్‌ మినిస్టర్ రేవంత్.. కేటీఆర్ స్ట్రాంగ్ రియాక్షన్

KTR Fires on CM Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. శుక్రవారం మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రలో కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. స్పందించిన కేటీఆర్.. గుర్తు పెట్టుకో మిస్టర్ చీఫ్‌ మినిస్టర్ రేవంత్ రెడ్డి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.  
 

1 /6

"నువ్వు స్లిప్పర్లు వేసుకొని  రాజకీయాల్లోకి వచ్చేందుకు పనికిమాలిన పోరనిలా తిరుగుతున్నప్పుడే.. ఆయన  తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం తన పదవికి తృణప్రాయంగా రాజీనామా చేశాడు..!" అని కేటీఆర్ అన్నారు.  

2 /6

రేవంత్ రెడ్డి పార్టీ టిక్కెట్  కోసం లాబీయింగ్‌లో బిజీగా ఉన్నప్పుడే.. ఆయన తెలంగాణ స్వరాష్ట్రం కావాలని స్వాప్నించాడని చెప్పారు. ఎంతో పట్టుదలతో పోరాటం చేసి తెలంగాణ సాధించారని గుర్తు చేశారు.   

3 /6

తెలంగాణ గొంతుకలను అణచివేయడానికి నువ్వు తుపాకీ పట్టుకున్నప్పుడు.. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టారని కేటీఆర్ అన్నారు.  

4 /6

"తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి నీ చేతులు "డబ్బుల బ్యాగులు" పట్టుకున్నప్పుడు.. సాధించిన తెలంగాణను దేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా తయారు చేసేందుకు ఆయన తన మేధస్సుకు పదును పెట్టారు." అని కేటీఆర్ పేర్కొన్నారు.   

5 /6

సాధించిన తెలంగాణను సగర్వంగా తలెత్తుకొనేలా చేసిన ఆయన ఈ రాష్ట్రానికి గర్వకారణమన్నారు.    

6 /6

"నీలాంటి జోకర్ ఆయన మీద పిచ్చి ప్రచారాలు చేస్తూ, దుర్భాషలాడి చరిత్ర నుంచి ఆయన పేరు చెరిపివేయవచ్చని అనుకోవటం మూర్ఖత్వం. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్‌ ఉంటారు. ఆ పేరును ఎవరు చెరిపేయలేరు. గుర్తు పెట్టుకో మిస్టర్ చీఫ్‌ మినిస్టర్ రేవంత్" అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.