Student Supports to Ex Minister KTR: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ గురువారం హాజరయ్యారు. లీగల్ టీమ్‌కు పర్మిషన్ లేకపోవడంతో ఒంటరిగా హాజరయ్యారు. ఈడీ కార్యాలయం వద్ద ఉన్న బీఆర్ఎస్ నేతలను కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసులో కేటీఆర్‌కు ఐదో తరగతి విద్యార్థి బాసటగా నిలిచాడు.
Bandi Sanjay Fires on KTR: బీఆర్ఎస్ సర్కార్ చేసిన స్కాంలు తెరపైకి వచ్చినప్పుడల్లా కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలకు కప్పం కట్టి వస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలను బీజేపీ ఎండగడుతుందన్నారు.
KTR On Formula E Race Case: ఏసీబీ అధికారులు ఇచ్చిన నోటీసులకు కేటీఆర్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అయితే ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లేందుకు కేటీఆర్‌తోపాటు న్యాయవాదులను అధికారులు అనుమతించలేదు. దీంతో రోడ్డుపైనే తన సమాధానం ఇచ్చేశారు.
KTR Vs CM Revanth Reddy: ఫార్ములా-ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చ జరిగితే.. అన్ని నిజాలు నిగ్గుతేలుతాయన్నారు.
KTR Fires on CM Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. శుక్రవారం మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రలో కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. స్పందించిన కేటీఆర్.. గుర్తు పెట్టుకో మిస్టర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
KTR Warning to Minister Konda Surekha: పిరికిపందల మాదిరి తన వ్యక్తిత్వం పైన ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తనపై మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై ఆయన పరువు నష్టం దావా కేసు వేసిన విషయం తెలిసిందే. విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. కేటీఆర్‌తోపాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.
KTR Fires On CM Revanth Reddy: తాను కష్టపడి అందరిని ఒప్పించి ఫార్మా సిటీ కోసం 14 వేల ఎకరాలు సేకరించానని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా సిటీ పేరు మార్చేసి ఫోర్ట్ సిటీ అంటోందన్నారు.
KTR Comments on HYDRA: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని హైదరాబాద్‌పై రేవంత్ రెడ్డి పగ పెంచుకున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైడ్రాతో నగరంలో పేదోళ్ల ఇళ్లు కూల్చుతున్నారని ఫైర్ అయ్యారు. బఫర్ జోన్లో ఉన్న సీఎం అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ తమకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తాము ఎవరిని బెదిరించలేదని.. హీరోయిన్లతో తమకేం పని ప్రశ్నించారు. అడ్డగోలుగా ఎవరు మాట్లాడినా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
KTR Fires On Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే మొదటి వ్యక్తి అని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని వీడిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టుకు వెళ్లయినా అనర్హత వేటు వేయిస్తామన్నారు.
KTR Health Update: మాజీ మంత్రి కేటీఆర్ గత రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్దే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. జ్వరం కారణంగా కరీంనగర్ కదన భేరి సభకు దూరమయ్యారు.
KTR Letter to CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఎల్ఆర్ఎస్ను ఎలాంటి చార్జీలు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకొని ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలన్నారు. గతంలో ఇచ్చిన మాటను తప్పినందుకు లేదా ప్రజలకు అబద్ధాలు చెప్పినందుకు ప్రజలను క్షమాపణ కోరాలని లేఖలో పేర్కొన్నారు.
KTR Challenges to CM Revanth Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. ఇద్దరం మల్కజ్గిరి నుంచి పోటీ చేద్దామన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు.
KTR Warning to CM Revanth Reddy: రాష్ట్రంలో జిల్లాలను రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని.. జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా..? అని మాజీ మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్నారు.
Telangana Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజార్చుకున్న బీఆర్ఎస్ రూటు మార్చిందా..? కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంతో ముందుకెళుతోందా..? ఒక వైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రజల మద్దతు కోసం కొత్త బాట పట్టిందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
KTR New Year Celebrations: నూతన సంవత్సర వేళ పారిశుధ్య కార్మిలకులతో కలిసి భోజనం చేస్తూ.. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా తమ సమస్యలను కేటీఆర్ దృష్టికి వాళ్లు తీసుకువచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.