Maha kumbh: మహా కుంభమేళలో ఇంకా ఎన్ని షాహీ స్నానాలు ఉన్నాయి.. వాటి ప్రాముఖ్యత.. ఎప్పుడో తెలుసా..?

Maha kumbh mela 2025: ప్రయాగ్ రాజ్ కుంభమేళలో భక్తులు ప్రతిరోజు తండోపతండాలుగా వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా.. 42 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం.
 

  • Feb 10, 2025, 18:51 PM IST
1 /6

కుంభమేళలో ప్రతిరోజు కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు కోసం తరలి వెళ్తున్నారు. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన కుంభమేళ కావడంతో ఎలా గైన వెళ్లేందుకు భక్తులు ప్రయత్నిస్తున్నారు. దీంతో బస్సులు, రైల్వేలు, విమానాలు, ప్రైవేటు వాహానాల్లో కూడా కుంభమేళకు వెళ్తున్నారు.  

2 /6

మరోవైపు కుంభమేళకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కల్గకుండా యోగి సర్కారు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.  ఈ క్రమంలో ప్రస్తుతం కుంభమేళ చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపుగా.. 300 కి.మీ.ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రపంచంలో అత్యంత పెద్ద ట్రాఫిక్ జాబ్ గా దీన్ని భావిస్తున్నారు.   

3 /6

జనవరి 13న ప్రారంభమైన కుంభమేళ ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది.దీనిలో అనేక షాహీస్నానాలు తేదీలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా జనవరి 13న పుష్య పౌర్ణమి, మకర సంక్రాంతి 14, మౌనీ అమావాస్య జనవరి 29, వసంత పంచమి ఫిబ్రవరి 3 పుణ్య రాజస్నానాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 42 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం.  

4 /6

అయితే.. ప్రస్తుతం మరో రెండు రాజస్నానాలు మిగిలి ఉన్నాయి. అవి ఫిబ్రవరి 2 మాఘీ పౌర్ణమి, ఫిబ్రవరి 26 మహా శివరాత్రి.ఈ పర్వదినాల్లో స్నానాలు ఆచరించేందుకు భక్తులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకటి పౌర్ణమి, మరోకటి అమావాస్యలలో పుణ్యస్నానాలు ఆచరిస్తే భక్తులకు కొండంత పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు.    

5 /6

ఇప్పటికే కుంభమేళలో రాజకీయ రంగ ప్రముఖులు,సెలబ్రీటీలు కుంభమేళకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. 

6 /6

కుంభమేళలో యూపీ సర్కారు.. 50 కోట్ల మంది హజరవుతారని భావించింది. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా రెండు షాహిస్నానాలు మిగిలి ఉండగానే.. కుంభమేళలో ఇప్పటికే 42 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో ఈజీగా కుంభమేళలో 50 కోట్ల సంఖ్య దాటిపోయేందుకు ఆస్కారం ఉందని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు.