RRB Recruitment 2025: రూ.1 లక్ష జీతంతో RRB ఉద్యోగాలు.. ఇప్పుడే ఇలా అప్లై చేసుకోండి.. మర్చిపోకండి..

RRB Recruitment Notification 2025: ఆర్‌ఆర్‌బి రైల్వే రిక్రూట్‌మెంట్‌ ప్రారంభమైంది. నిరుద్యోగ యువత నేరుగా వెబ్‌సైట్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ఖాళీ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

RRB Recruitment Notification 2025: నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన గుడ్‌న్యూస్‌ తెలిపింది. 2025 సంవత్సరానికి సంబంధించిన ఆర్‌ఆర్‌బి రైల్వే రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. వివిధ విభాగాల్లో ఖాళీ ఉన్న 1036 ఉద్యోగులకు దరఖాస్తును కోరింది. అంతేకాకుండా నోటిఫికేషన్‌కు సంబంధించిన చివరి తేదిని కూడా పొడగించింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు కలిగిన అభ్యర్థులు 24 ఫిబ్రవరిలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
 

1 /6

ఆర్‌ఆర్‌బి రైల్వే రిక్రూట్‌మెంట్‌కి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఖాళీ ఉన్న లైబ్రేరియన్, జూనియర్ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులతో పాటు ప్రాథమిక ఉపాధ్యాయుడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపారు.  

2 /6

అంతేకాకుండా సంగీత ఉపాధ్యాయుడితో పాటు మహిళా అసిస్టెంట్ టీచర్‌కి సంబంధించిన పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికీ అప్లై చేసుకునేవారు ఈ 24 ఫిబ్రవరిలోపే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌లో మొత్తం పోస్టులు 1036 ఉన్నట్లు వెల్లడించారు.  

3 /6

ఇక నోటిఫకేషన్‌లో RRB పోస్టులకి సంబంధించిన జీతాలను కూడా వెల్లడించారు. ఇందులో ఉన్న ఖాళీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను ఉద్యోగాలను బట్టి ప్రతి రూ. 45,000 నుంచి రూ.1,12,000 జీతం అందించబోతున్నట్లు తెలిపారు.  

4 /6

ఈ నోటిఫికేషన్‌లో ఫీజుకు సంబంధించిన వివరాలను కూడా క్లుప్తంగా పేర్కొన్నారు. ఈబీసీకి చెందిన వారికి రూ.250 అప్లికేషన్ ఫీజు ఉంటుందని వెల్లడించారు. అలాగే అభ్యర్థుల వయసు 18 నుంచి 48 ఏళ్లు ఉండాలని తెలిపారు.   

5 /6

అలాగే ఈ నోటిఫికేషన్‌లో విద్య అర్హతలను కూడా క్లుప్తంగా వెల్లడించారు. ఈ జాబ్స్‌ అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పకుండా  డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో పాటు M. Sc, BA, B.Ed విద్యార్హతను కలిగి ఉండాలని తెలిపారు. ఈ ఉద్యోగలను నేరుగా  https://indianrailways.gov.in/ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు..  

6 /6

ఇక ఈ జాబ్స్‌కి సంబంధించిన ఎంపిక వివరాలను కూడా నోటిఫికేషన్‌లో తెలిపారు. వీటికి సంబంధించిన ఎంపిక రాత పరీక్ష (CBT), ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. వీటిల్లో ఎంపికైనవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వనున్నారు.